వరుస సినిమాలు ఒప్పుకోవడం వల్లే 'హిట్' సినిమా రెండో భాగంలో నటించేందుకు కుదరలేదని యువ కథానాయకుడు విశ్వక్ సేన్ స్పష్టం చేశారు. లాక్ డౌన్‌కు ముందు విడుదలైన చివరి చిత్రంగా నిలిచిన హిట్.. ఆ తర్వాత ఓటీటీలో కూడా మంచి ఆదరణ పొందిందని, అది తన అదృష్టమని విశ్వక్ సేన్ అన్నారు.
ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విశ్వక్ సేన్ ఈటీవీతో మాట్లాడుతూ... తాను నటించిన 'పాగల్' చిత్రం పది సినిమాలు చేసిన అనుభవాన్ని ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. పలువురు అగ్ర నిర్మాతల చిత్రాల్లో నటిస్తున్నట్లు చెప్పిన ఆయన.. తన సొంత నిర్మాణ సంస్థలో తదుపరి చిత్రం చేయడానికి కుదరడం లేదని తెలిపారు.