ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కేన్స్: ఈసారి బాలీవుడ్​ సుందరీమణుల మాయ లేదుగా! - Kane film festival bollywood missing

ప్రతిష్ఠాత్మక 74వ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం(Kanes Film Festival) ఫ్రాన్స్​లోని కేన్స్​లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఎర్రతివాచీపై నడుస్తూ పలువురు హాలీవుడ్​ తారలు సందడి చేశారు. అయితే ప్రతిఏటా అక్కడి ఎర్రతివాచీపై హోయలొలికించే మన బాలీవుడ్​ ముద్దుగుమ్మలు.. కరోనా ఆంక్షల వల్ల ఈ ఏట అక్కడికి వెళ్లలేకపోయారు. ఈ నేపథ్యంలో కొత్త ఫ్యాషన్​ దుస్తులను ధరించి గతంలో తమ అందాలను ఆరబోసిన భామలను ఓ సారి చూసేద్దాం..

kanes
కేన్స్
author img

By

Published : Jul 7, 2021, 9:49 PM IST

ప్రతిష్ఠాత్మక కేన్స్​ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం(Kanes Film Festival) ప్రతిఏటా ఫ్రాన్స్​లోని కేన్స్​లో అట్టహాసంగా జరుగుతుంది. ఈ వేడుకలో మహామహుల్లాంటి తారలకు అక్కడి రెడ్​కార్పెట్​ స్వాగతం పలుకుతుంది. ముఖ్యంగా బాలీవుడ్​ టు హాలీవుడ్​ నాయికలు కళ్లు చెదిరే కొత్త ఫ్యాషన్​ దుస్తులను ధరించి ఈ ఎర్రతివాచీపై వయ్యారాలు ఒలకబోస్తుంటే కెమెరాలన్నీ వారివైపే తిరుగుతుంటాయి. సుందరీమణులంతా ర్యాంప్​ వాక్​లు చేస్తూ వారి హొయలతో మతిపోగొడుతుంటారు. అయితే ఈ సారి బాలీవుడ్(Bollywood)​ భామలకు ఎర్రతివాచీ స్వాగతం దక్కకుండా పోయింది. కేవలం హాలీవుడ్​ తారలు మాత్రమే సందడిచేశారు.

ఇదే కారణం

గతేడాది కరోనా కారణంగా రద్దైన ప్రపంచ ప్రఖ్యాత 'కేన్స్ అంతర్జాతీయ​ చలన చిత్రోత్సవం' ఈసారి కరోనా ఆంక్షల నడుమ ఘనంగా నిర్వహించారు. ఫ్రాన్స్​లోని కేన్స్​ నగరం వేదికగా.. మంగళవారం ఈ సినిమా సంబరం ఘనంగా ప్రారంభమైంది. కొవిడ్​ టీకా తీసుకున్నవారిని లేదా 48 గంటల ముందు కరోనా పరీక్షల్లో నెగెటివ్​ వచ్చిన వారిని మాత్రమే లోపలికి అనుమతించాలని నిర్ణయించారు. అయితే ​ప్రయాణాల విషయంలో భారత్‌ను రెడ్‌ లిస్ట్‌లో చేర్చారు. భారత్‌ నుంచి ఫ్రాన్స్​ వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా పది రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కారణంగా మన అందాల భామలు అక్కడికి వెళ్లకుండా ఆగిపోయారు. దీంతో కేవలం హాలీవుడ్​ భామలు మాత్రమే అందాలను ఆరబోశారు. ఈ నేపథ్యంలో గతంలో కేన్స్​ ఎర్రతివాచీపై తళుక్కుమన్న మన ముద్దుగుమ్మల ఫొటోలపై ఓ లుక్కేద్దాం..

హొయలు ఒలికిస్తున్న చిత్రాలు

in article image
దీపికా పదుకొణె
దీపికా పదుకొణె
కంగనా రనౌత్​
కంగనా రనౌత్​
ప్రియాంక చోప్రా
ప్రియాంక చోప్రా
దీపికా పదుకొణె
ప్రియాంక చోప్రా

చిత్రోత్సవంలో భాగంగా.. మొదటి రోజు ఎర్ర తివాచీపై పలువురు హాలీవుడ్​ తారలు నడుస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. వచ్చే శనివారం(జులై 17) వరకు ఈ సినీ సంబరం కొనసాగనుంది. ఆరంభ చిత్రంగా లియోస్​ కారక్స్​ తెరకెక్కించిన 'అన్నెట్టే' చిత్రాన్ని ప్రదర్శించారు.

ఇదీ చూడండి:

కేన్స్​: అందాలతో కట్టిపడేసిన కంగన, దీపిక

కేన్స్​లో మెరిసిన ప్రియాంక, దీపిక

ABOUT THE AUTHOR

...view details