తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహేశ్‌ తొలిసారి కొన్న ఫోన్‌ ఏంటో తెలుసా? - mahesh trivikram movie

సూపర్​స్టార్​ మహేశ్​బాబుతో(mahesh babu sarkari vari pata) సెల్ఫీ దిగాలని ఎవరికి మాత్రం ఉండదు. ఆ అవకాశం కోసం ఎంతో మంది ఎదురుచూస్తారు. మరి ప్రిన్స్​ ఎవరితో సెల్ఫీ దిగాలని అనుకుంటారో తెలుసా? ఆయన తొలిసారిగా కొన్న ఫోన్‌ ఏంటో తెలుసా? వాటికి సమాధానాలే ఈ కథనం. తెలుసుకోవాలంటే చదివేయండి..

mahesh
మహేశ్​

By

Published : Sep 24, 2021, 10:11 PM IST

తమ అభిమాన నటులు ఎలాంటి ఫోన్లు వాడతారు? వారి తొలి మొబైల్‌ ఏంటి? ఎవరితో సెల్ఫీ తీసుకునేందుకు ఇష్టపడతారు? వంటి అంశాలను చాలామంది ఆరా తీస్తుంటారు. ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకునేందుకు అమితాసక్తి ప్రదర్శిస్తుంటారు. మరి ప్రముఖ నటుడు మహేశ్‌ బాబు(mahesh babu sarkari vari pata) తొలిసారిగా ఏ ఫోన్‌ కొన్నారు? ఎవరితో సెల్ఫీ తీసుకోవాలనుకుంటారు? తెలుసుకోవాలని ఉందా? అయితే.. ఇది చదవండి.

ఎన్నో కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న మహేశ్‌ బాబు తాజాగా మరో కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన అభిమానులు, విలేకరులు మహేశ్‌ బాబు వాడిన ఫోన్లు, కొత్త సినిమాల అప్‌డేట్లు గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మహేశ్‌ చిరు నవ్వుతో వారికి సమాధానమిచ్చారు. 'మీరు తొలిసారిగా కొన్న ఫోన్‌ ఏదని' అని ఒకరు అడగ్గా 'నోకియా క్లాసికల్‌ మోడల్‌ (కీ ప్యాడ్‌)' అని తెలిపారు. 'మీతో సెల్ఫీ తీసుకునే అవకాశం కోసం ఎంతోమంది ఎదురుచూస్తుంటారు. మరి మీరు ఎవరితో సెల్ఫీతో దిగాలనుకుంటారు?' అనే ప్రశ్నకి 'మా ఫాదర్‌తో' అని చెప్పారు.

పరశురామ్‌ దర్శకత్వంలో నటిస్తోన్న 'సర్కారు వారి పాట'(mahesh babu sarkari vari pata) చిత్రీకరణ సుమారు 70శాతం పూర్తయిందని, ఇప్పటివరకు చూడని మహేశ్‌ని ఈ చిత్రంలో చూస్తారని తెలిపారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో(mahesh babu trivikram movie) నటించనున్న సినిమా ఈ ఏడాది చివరిలో పట్టాలెక్కే అవకాశాలున్నాయన్నారు. రాజమౌళి దర్శకత్వంలో(ss rajamouli mahesh babu movie) నటించేందుకు ఆసక్తిగా ఉన్నానని, ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే వస్తాయని చెప్పారు.

ఇదీ చూడండి: ఆ పుస్తకం మహేశ్​బాబును సిగరెట్​ మాన్పించిందట!

ABOUT THE AUTHOR

...view details