రాజ్ కుంద్రా ప్రధాన నిందితుడిగా ఉన్న అశ్లీల చిత్రాల దందా కేసు విచారణలో విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పోర్న్ చిత్రాల ప్రసారానికి ఏర్పాటు చేసిన హాట్ షాట్స్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించడం వల్ల కుంద్రా ప్లాన్-బీని అమలు చేసినట్లు తెలుస్తోంది. బాలీఫేమ్ పేరుతో మరో యాప్‌ను ఏర్పాటు చేసి దందాను కొనసాగించారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు ఇంటెలిజెన్స్ బ్యూరోకు (ఐబీ) చెందిన ఓ అధికారిని అతడికి తెలియకుండానే ఇందులో భాగస్వామిని చేసినట్లు వెల్లడైంది.
పరారీలో ఉన్న కుంద్రా సన్నిహితుడు యష్ ఠాకుర్ ముందస్తు ప్రణాళికతో ఆ అధికారితో స్నేహ సంబంధాలను ఏర్పర్చుకున్నాడు. అవార్డులు గెలుచుకున్న లఘు చిత్రాలను ప్రసారం చేసేందుకు యాప్‌ను ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించాడు. దీంతో ఆ అధికారి తన భార్య పేరు మీద బాలీఫేమ్ యాప్‌ను రిజిస్టర్ చేశాడు. అయితే ఆ యాప్‌లో అశ్లీల చిత్రాలను అప్‌లోడ్ చేయడం వల్ల అతడు అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది.
కుంద్రా అరెస్టైన మరుసటి రోజు ఆ యాప్ నుంచి పోర్న్ చిత్రాలను తొలగించమని తమకు చెప్పినట్లు ఈ కేసులో సాక్షులుగా మారిన కుంద్రా సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులు తెలిపారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసులో మంగళవారం విచారణకు రావాలంటూ నటి షెర్లిన్ చోప్రాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసు విచారణలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందంటూ ఆ రాష్ట్ర భాజపా నేత ఆశిష్ షెలార్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
కుంద్రాపై గుజరాత్ వ్యాపారి ఫిర్యాదు