తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అంధాధున్'​ తమిళ రీమేక్​లో ప్రియా ఆనంద్​! - andhadhun tamil remake

బాలీవుడ్​ హిట్​ చిత్రం 'అంధాధున్'​ తమిళ రీమేక్​లోని కీలక పాత్రలో హీరోయిన్​ ప్రియా ఆనంద్​ నటించనుందని సమాచారం. హిందీలో రాధికా ఆప్టే పోషించిన పాత్ర ఆమె చేయబోతున్నట్లు తెలుస్తోంది.

priya anand
ప్రియా ఆనంద్​

By

Published : Mar 20, 2021, 8:32 AM IST

బాలీవుడ్ యువ​ హీరో ఆయుష్మాన్​ ఖురానా నటించిన సూపర్​హిట్​ చిత్రం 'అంధాధున్'. ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో నటి రాధికా ఆప్టే నటించారు. ఈ చిత్ర తమిళ రీమేక్​.. ప్రశాంత్​ హీరోగా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలో రాధిక పాత్రను హీరోయిన్​ ప్రియా ఆనంద్​ పోషించనుందని కోలీవుడ్ టాక్. దీనిపై చర్చలు కూడా జరిగాయని తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ సినిమాకు ప్రశాంత్​ తండ్రి త్యాగరాజన్​ దర్శకత్వం వహిస్తుండగా.. వనిత విజయ్​కుమార్​, సిమ్రాన్​, దర్శకుడు కేఎస్​ రవి కుమార్​ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఈ సినిమా తెలుగు రీమేక్​లో నితిన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియాంకా అరుల్​ మోహన్​ హీరోయిన్​గా చేస్తోంది.

ఇదీ చూడండి: చైనాలో 200 కోట్లు కొల్లగొట్టిన 'అంధాధున్'

ABOUT THE AUTHOR

...view details