తెలంగాణ

telangana

ETV Bharat / sitara

యువరాజ్ పాత్రలో 'గల్లీబాయ్' నటుడు - సిద్దాంత్ చతుర్వేది హీరోగా యువరాజ్ సింగ్ బయోపిక్

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవితాధారంగా బాలీవుడ్​లో ఓ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే యువీ పాత్రలో ఎవరు నటిస్తారన్న విషయమై ఇప్పటికీ క్లారిటీ లేదు. తాజాగా ఓ బాలీవుడ్ నటుడి పేరు తెరపైకి వచ్చింది.

Yuvaraj Sing Biopic
Yuvaraj Sing Biopic

By

Published : Mar 16, 2020, 8:59 PM IST

ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో బయోపిక్‌ల యుగం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ క్రికెట్‌ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ జీవితాధారంగా ఓ సినిమా తీయనున్నారని సమాచారం. అయితే యువీ పాత్రలో ఎవరు నటించనున్నారన్న విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. తాజాగా యువరాజ్‌ పాత్రలో నటుడు సిద్ధాంత్‌ చతుర్వేది కనిపిస్తాడన్న వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

వెబ్‌సీరీస్, బుల్లితెరపై నటుడిగా ప్రస్థానం ప్రారంభించిన సిద్ధాంత్ 'గల్లీబాయ్‌' చిత్రంలో రణ్​వీర్ సింగ్‌తో కలిసి శ్రీకాంత్‌ బోస్లే పాత్రలో నటించి మెప్పించాడు. ప్రస్తుతం 'బంటీ అవుర్‌ బబ్లీ 2' సినిమాలో సైఫ్‌ అలీఖాన్, రాణీముఖర్జీతో కలిసి నటిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details