తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఎవడు ఏమనుకుంటే నాకేంటి.. నేను అనుకున్నదే చేస్తా'

శ్రీవిష్ణు హీరోగా నటించిన 'తిప్పరా మీసం' ట్రైలర్​ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుందీ చిత్రం.

By

Published : Nov 6, 2019, 4:40 PM IST

తిప్పరా మీసం సినిమా ట్రైలర్

విభిన్న చిత్రాలతో టాలీవుడ్​లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శ్రీవిష్ణు. ప్రస్తుతం 'తిప్పరా మీసం' అనే సినిమాలో నటిస్తున్నాడు. ట్రైలర్​ను చిత్రబృందం బుధవారం విడుదల చేసింది. ఇప్పటివరకు సాఫ్ట్​ రోల్స్​ చేసిన ఈ నటుడు.. ఇందులో ప్రతినాయక లక్షణాలున్న పాత్రలో కనిపించనున్నాడు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

డ్రగ్స్‌, మందు, అమ్మాయిలకు బానిసైన ఓ ఆవేశపరుడైన కుర్రాడి కథే 'తిప్పరామీసం'. అయితే ట్రైలర్​లో రోహిణి, శ్రీవిష్ణుల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.

నిక్కీ తంబోలి హీరోయిన్‌. సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు. కృష్ణ విజయ్ దర్శకత్వం వహించాడు. రిజ్వాన్ నిర్మాతగా వ్యవహరించారు.

'బ్రోచేవారెవరురా'తో శ్రీ విష్ణు ఇటీవలే హిట్​ అందుకున్నాడు. ఇప్పుడు 'తిప్పరామీసం' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇది చదవండి: అప్పుడు చరణ్​.. ఇప్పుడు వరుణ్​తో రొమాన్స్​!

ABOUT THE AUTHOR

...view details