- బాలనటుడిగా మెప్పించిన తేజా సజ్జా.. హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'జాంబీ రెడ్డి'. ఈ సినిమాను తొలుత సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
- అల్లరి నరేశ్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'బంగారు బుల్లోడు'. ఈ సినిమాను జనవరి 23న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
- సందీప్ కిషన్ హీరోగా క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'ఏ1 ఎక్స్ప్రెస్'. ఈ సినిమాను ఫిబ్రవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
- బుల్లితెర వ్యాఖ్యాత ప్రదీప్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న చిత్రం '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'. ఈ చిత్రాన్ని జనవరి 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
త్వరలో విడుదల కాబోతున్న చిత్రాలివే! - సందీప్ కిషన్ వార్తలు
కరోనా కారణంగా గతేడాది విడుదలకు నోచుకోని సినిమాలన్నీ థియేటర్లు బాట పడుతున్నాయి. సినిమాహాళ్లను తెరచిన తర్వాత ప్రేక్షకుల నుంచి విశేషాదరణ దక్కడం వల్ల కొత్త చిత్రాలను విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నద్ధమవుతున్నారు. సంక్రాంతి తర్వాత విడుదల కాబోతున్న సినిమాలేవో చూద్దాం.
త్వరలో విడుదల కాబోతున్న చిత్రాలివే!
ఇదీ చూడండి:'బ్యాచ్లర్'గా అఖిల్ వచ్చేది అప్పుడే!