Heroines youtube channels: ట్విట్టర్, ఇన్‌స్టా ద్వారా పలువురు హీరోయిన్లు తమకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. అయితే కొంతముంది ముద్దుగుమ్మలు మాత్రం యూట్యూబ్ ఛానళ్ల ద్వారా ఫ్యాన్స్‌కు చేరువవుతున్నారు. ఈ మాధ్యమం ద్వారా పలు విషయాలపై అవగాహన కల్పించడం సహా ఆసక్తికర సంగతులను చెబుతున్నారు. ఇంతకీ ఆ కథానాయికలు ఎవరో చూద్దాం..
వంటల నుంచి వ్యాపారం దాకా..
Aliabhatt youtube channel: త్వరలో 'ఆర్‌ఆర్‌ఆర్' ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్న ఆలియాభట్ తన వ్యక్తిగత విషయాల నుంచీ... సినిమాల వరకూ సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకునేందుకు ముందుంటుంది. ఇందులో ఎక్కువగా ఆలియా తీసుకునే ఆహారం, చేసిన వంటకాల ప్రయోగాలు, వ్యాయామాలు, మేకప్... ఆమె ప్రారంభించిన పిల్లల దుస్తుల కంపెనీకి సంబంధించిన ప్రకటనల తాలూకు వీడియోలు ఉంటాయి. వీటన్నింటితోపాటూ తన సినిమాలకు సంబంధించిన వివరాలను కూడా ఈ ఛానల్‌లో అప్పుడప్పుడూ పోస్ట్ చేస్తుంటుంది. దీన్ని సరదాగానే ప్రారంభించినా ప్రస్తుతం పదహారు లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారనీ, ఎప్పటికప్పుడు కొత్త విషయాలను పంచుకునేందుకు ఇది కూడా చక్కని వేదికేననీ అంటుంది ఆలియా.
ఆదాయం పి.ఎం. నిధికి..
Rakulpreetsingh youtube channel:ఫిట్‌నెస్ అంటే ప్రాణం పెట్టే రకుల్ తాను చేసే వర్కవుట్లూ, తీసుకునే ఆహారానికి సంబంధించిన ఫొటోలూ, వివరాలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం మామూలే. కానీ అక్కడితోనే ఆగిపోకుండా... తన పేరుతో యూట్యూబ్ ఛానల్‌నీ అందుబాటులోకి తెచ్చింది రకుల్ ప్రీత్‌సింగ్. తన ఛానల్ ద్వారా బోలెడు సరదా విషయాలను తెలుసుకోవచ్చనే ఈ నటి... ఇందులో ఎక్కువగా ఆహారం, అందం, వ్యాయామం, స్నేహితులూ, పోషకాల వంటలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తోంది. దీన్ని సరదాగా ప్రారంభించాననీ... తీరిక దొరికినప్పుడల్లా వీడియోలు పోస్ట్ చేస్తుంటాననీ చెప్పే రకుల్... ఈ ఛానల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి అందిస్తానని అంటోంది. ప్రస్తుతం ఈ ఛానల్‌కు రెండు లక్షలా నలభై వేలమందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉండటం విశేషం.
రకుల్‌ప్రీత్ సింగ్ యుట్యూబ్ ఛానల్ చిట్కాలు చెప్పే 'చిట్టిచిలకమ్మ...'
Manchu laxmi youtube channel:యాంకరింగ్, సినిమా అంటూ క్షణం తీరిక లేకుండా గడిపే మంచులక్ష్మి కూతురు పుట్టాక 'చిట్టి చిలకమ్మ' పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది. అందులో పిల్లల పెంపకం, వాళ్ల ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు, తన కూతురు విద్యానిర్వాణ చేసే అల్లరిపనుల గురించీ చెప్పడం మొదలుపెట్టింది. లక్షా ముప్ఫైనాలుగువేల సబ్‌స్క్రైబర్లు ఉన్న ఈ ఛానల్‌ను నడిపిస్తూనే మరొకటి అందుబాటులోకి తెచ్చింది. ఇందులో హోంటూర్‌లూ, తన వర్కవుట్లూ, అలంకరణ... ఇలా ఎన్నో విషయాలను పోస్ట్ చేస్తోంది. దాదాపు రెండు లక్షల మంది చందాదారులు ఉన్న ఈ ఛానల్‌లోనూ అందరికీ ఉపయోగపడే విషయాలను పంచుకుంటానని చెబుతోంది.
మంచు లక్ష్మీ యుట్యూబ్ ఛానల్ అభిమానులకు దగ్గరవ్వాలని...
sada youtube channel 'జయం', 'నిజం', 'అపరిచితుడు' వంటి సినిమాల్లో నటించి, ఇప్పుడు రియాలిటీ షోలల్లో పాల్గొంటున్న సదా కొంతకాలం క్రితం 'సదా గ్రీన్ లైఫ్' పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను మొదలు పెట్టింది. తాను చేసే వంటకాలు, తీసుకునే ఆహారం, అభిరుచులూ... ఇలా ఎన్నో విషయాలకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేసేస్తూ అభిమానులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం తన ఛానల్‌కు లక్షా ఎనభైఎనిమిది వేలమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారనీ... ఈ సంఖ్యను ఇంకా పెంచేందుకు తనకు తోచిన ప్రయోగాలన్నీ చేస్తున్నాననీ వివరిస్తుంది సదా.
సరదాగా ముచ్చటిస్తూ...
Kajol agarwal youtube channel: 'ఆచార్య'తో మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించనున్న కాజల్ అగర్వాల్‌కూ యూట్యూబ్ ఛానల్ ఉంది. దాదాపు అయిదేళ్లక్రితం ఈ ఛానల్‌ను ప్రారంభించిన కాజల్... తీరిక ఉన్నప్పుడల్లా ఇందులో వీడియోలు పోస్ట్ చేస్తుంది... అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, తన వర్కవుట్లు తెలియజేయడం... వంటివెన్నో ఈ ఛానల్‌లో చూడొచ్చు. తనకు సబ్‌స్క్రైబర్ల సంఖ్య ముఖ్యం కాదనీ.. అందుకే తీరిక దొరికినప్పుడు మాత్రమే వీడియోలను పెడతాననీ చెప్పే కాజల్... దీన్ని సరదాగానే ప్రారంభించిందట. ఆమె ఛానల్‌కు ప్రస్తుతం రెండులక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారట.
ఇదీ చూడండి: 'సినిమాలు వదిలేద్దామనుకున్నా.. నాగ్ అండగా నిలిచారు'