తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దక్షిణాదిలో ఎంట్రీ.. బాలీవుడ్​లో స్టార్ హోదా! - కత్రినా కైఫ్

బాలీవుడ్​లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా చలామణి అవుతున్న కొందరు దక్షిణాదిలోనే వారి కెరీర్ ప్రారంభించారు. ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణె, కత్రినా కైఫ్, తాప్సీ వంటి కథానాయికలు ఈ జాబితాలో ఉన్నారు.

These Bollywood Actress debut with South movies-
దక్షిణాదిలో ఎంట్రీ.. బాలీవుడ్​లో స్టార్ హోదా!

By

Published : Apr 1, 2021, 5:32 PM IST

ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, దీపికా పదుకొణె.. వీరంతా ప్రస్తుతం బాలీవుడ్​లో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్నారు. కొందరైతే హాలీవుడ్​లోనూ అవకాశాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోలకు తగ్గట్టుగా పారితోషికం అందుకుంటూ జోరు చూపిస్తున్నారు. అయితే ఇంత ఎదిగిన వీరు దక్షిణాది సినిమాలతోనే కెరీర్​ ప్రారంభించిన విషయం మీకు తెలుసా. వీరే కాదు.. ఇలా స్టార్ హీరోయిన్లుగా పేరు సంపాదించిన మరికొందరు కూడా మొదట సౌత్​లోనే అడుగుపెట్టారు. వారెవరో చూద్దాం.

ప్రియాంకా చోప్రా

ప్రస్తుతం హాలీవుడ్​లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది ప్రియాంకా చోప్రా. అయితే ఈమె హీరోయిన్​గా చేసిన మొదటి చిత్రం కోలీవుడ్​లోనే. విజయ్ హీరోగా నటించిన 'తమిజాన్' సినిమాతో తన కెరీర్​ను ప్రారంభించింది ప్రియాంక. తర్వాత బాలీవుడ్​కు మకాం మార్చి స్టార్ హీరోయిన్​గా వెలుగొందుతోంది.

ప్రియాంకా చోప్రా

ఐశ్వర్యా రాయ్

మిస్ వరల్డ్​ టైటిల్ నెగ్గి అందరి దృష్టినీ ఆకర్షించింది ఐశ్వర్యా రాయ్. అంతటి ఘనత దక్కించుకున్నా మొదట బాలీవుడ్​లో అవకాశాలు దక్కించుకోలేకపోయింది. ఐశ్వర్య వెండితెరకు పరిచయమైన చిత్రం 'ఇద్దరు'. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా హిట్ కావడం వల్ల బాలీవుడ్​లోనూ వరుస అవకాశాలు దక్కించుకుంది.

ఐశ్వర్యా రాయ్

దిశా పటానీ

ప్రస్తుతం బాలీవుడ్​లో మోస్ట్ సెక్సీయెస్ట్ హీరోయిన్​గా జోరు చూపిస్తోంది దిశా పటానీ. అగ్రనటుల సరసన అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది. అయితే ఈ హీరోయిన్​ మొదటగా చేసిన చిత్రం 'లోఫర్'. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు.

దిశా పటానీ

కృతి సనన్

బాలీవుడ్​లో పేరు సంపాదించుకున్న మరో నటి కృతి సనన్. ప్రస్తుతం ప్రభాస్ సరసన 'ఆదిపురుష్'​లో నటిస్తోంది. అలాగే హిందీ సినీ పరిశ్రమలో మోస్ట్ హ్యాపెనింగ్​ స్టార్​గా వెలుగొందుతోంది. అయితే ఈ భామ కెరీర్ ప్రారంభమైంది కూడా టాలీవుడ్​లోనే. మహేశ్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన '1 నేనొక్కడినే' చిత్రంతో హీరోయిన్​గా పరిచయమైంది కృతి.

కృతి సనన్

దీపికా పదుకొణె

ప్రియాంకా చోప్రా తర్వాత హాలీవుడ్​ అవకాశం దక్కించుకుంది దీపికా పదుకొణె. ప్రస్తుతం బాలీవుడ్​లో స్టార్ హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకుని హీరోలకు పోటీగా పారితోషికం తీసుకుంటూ దూసుకెళ్తోంది. అయితే దీపిక కూడా దక్షిణాది చిత్రంతోనే వెండితెరకు పరిచయమైంది. ఉపేంద్ర హీరోగా వచ్చిన 'ఐశ్వర్య' అనే కన్నడ సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది దీపిక.

దీపికా పదుకొణె

తాప్సీ

మహిళా ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు విభిన్న పాత్రలు చేస్తూ బాలీవుడ్​లో మకాం వేసింది తాప్సీ. విలక్షణమైన కథలను ఎంచుకుంటూ విమర్శకుల ప్రశంసలూ అందుకుంటోంది. అయితే తాప్సీ హీరోయిన్​గా చేసిన మొదటి చిత్రం 'ఝుమ్మంది నాదం'. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమాలో మంచు మనోజ్ సరసన ఆడిపాడింది తాప్సీ.

తాప్సీ

ఇవీ చూడండి:

అవకాశాలతో 'ఆహా' అనిపిస్తున్న భామలు!

ఈ స్టార్స్​కు భారతీయ పౌరసత్వం లేదా?

ABOUT THE AUTHOR

...view details