మరుగున పడ్డ రియల్ హీరోల కథలను తెరపై చూపిస్తూ హిట్ కొడుతున్నారు రీల్ హీరోలు. ఈ ఒరవడిలో వచ్చిందే 'జై భీమ్'. తెలుగువాళ్లకీ దగ్గరైన తమిళ హీరో సూర్య.. జస్టిస్ చంద్రు పాత్రలో జీవించేశాడు. ఇదొక్కటే కాదు.. తను బయోపిక్‌ల బాస్. నిజ జీవితాల ఆధారంగా తెరకెక్కిన పలు పాత్రల్లో మెప్పించాడు. ఆ వివరాలు..
'యువ'లో జార్జిరెడ్డిగా!
పద్దెనిమిదేళ్ల కిందట వచ్చిన మణిరత్నం దృశ్యకావ్యం 'ఆయుథ ఎజుత్తు'(surya yuva movie) చాలామందికి ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. అందులో విద్యార్థి నాయకుడిగా మెప్పించాడు సూర్య. తమిళంలో భారీ విజయం సాధించి తెలుగులో 'యువ'గా(surya yuva movie cast) డబ్బింగ్ చేసిన ఈ సినిమాలో మైఖేల్ వసంత్ పాత్రకు ప్రేరణ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడు, తెలుగు యువకుడు జార్జిరెడ్డినే! కాలేజీలో జరిగే అన్యాయాలను ఎదిరించే నాయకుడిగా, అవినీతి రాజకీయ నాయకులతో కడదాకా పోరాడే విద్యార్థిగా సూర్య నటన అద్భుతంగా ఉందని అప్పట్లో అంతా పొగిడారు. ఇది పూర్తిస్థాయి జార్జిరెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన సినిమా కాకపోయినా అతడి లైఫ్ స్టోరీ నుంచి ప్రేరణ పొందిన పాత్రగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసం సూర్య స్వయంగా జార్జిరెడ్డి స్నేహితులు కొందరితో మాట్లాడాడు. గమనిస్తే మైఖేల్ మేకప్ జార్జిని పోలి ఉంటుంది.
సూర్య సన్ ఆఫ్ కృష్ణన్- గౌతమ్ వాసుదేవ మేనన్
ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ సొంతంగా తెరకెక్కించిన బయోపిక్ 'వారనమ్ ఆయిరం'(surya son of krishnan movie review). తెలుగులో ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’. గౌతమ్ మేనన్ నాన్న ఆర్మీలో పని చేస్తూ చనిపోయారు. తన తల్లి, బంధువులు.. తండ్రి గురించి చెప్పిన వివరాలు తీసుకొని, తన జీవితంలోని కొన్ని సంఘటనలు జోడించి వాటి ఆధారంగా ఈ సినిమాను మలిచాడు మేనన్. సూర్య కెరీర్‌లో భారీ విజయం సాధించిన చిత్రాల్లో ఇదొకటి9surya son of krishnan movie release date). ఆర్మీ అధికారిగా, అతడి కొడుకుగా సూర్య ద్విపాత్రాభియనం చేసిన ఈ సినిమా జాతీయ అవార్డు సైతం గెల్చుకుంది.
రక్తచరిత్ర- మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డి
కరుడు గట్టిన ఫ్యాక్షన్ నేతగా, పగ ప్రతీకారాలతో రగిలిపోయే నాయకుడిగా సూర్య(surya rakta charitra 2) మేటి హావభావాలు పలికించిన సినిమా రక్త చరిత్ర-2. ఈ సినిమా ద్వారా తెలుగు, హిందీల్లో నేరుగా తెరంగేట్రం చేశాడు. రాయలసీమలో రక్తచరిత్ర లిఖించిన పరిటాల రవి, మద్దెలచెరువు సూరి వర్గీయుల మధ్య వైరమే ఈ చిత్రం కథ. దర్శకుడు రాంగోపాల్ వర్మ సూర్య పాత్ర పేరు యేటూరి సూర్యనారాయణరెడ్డిగా చిత్రీకరించినా ఇది ఫ్యాక్షన్ నాయకుడు మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డి ప్రేరణతో రూపొందిన పాత్రనే. సినిమా సూపర్‌హిట్ కాకపోయినా సూర్య నటనకు సూపర్ అనే పేరొచ్చింది.