తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నా జీవితంలో అతి ముఖ్యమైన కోరికలు ఇవే' - కృతి సనన్ కల

ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది బాలీవుడ్ నటి కృతిసనన్. వృత్తి జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూనే వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించాలని అంటోంది. జీవితంలో తనకు మూడు ముఖ్యమైన కోరికలున్నాయని తెలిపింది.

Kriti Sanon
కృతి సనన్

By

Published : Apr 9, 2021, 7:29 AM IST

వరుస అవకాశాలతో దూసుకుపోతున్న బాలీవుడ్ యువ కథానాయికల్లో కృతిసనన్ ఒకరు. ఆమె చేతిలో ప్రస్తుతం 'బచ్చన్‌పాండే', 'ఆదిపురుష్' లాంటి భారీ చిత్రాలున్నాయి. వృత్తి జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూనే వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించాలనేది కృతి అనుసరించే విధానం. అందుకు తగ్గట్టే తన జీవితాన్ని, కెరీర్​ను ప్లాన్ చేసుకుంటుందామే. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన అతి ముఖ్యమైన మూడు కోరికల్ని పంచుకుంది కృతి.

కృతి సనన్

"ఓ పెద్ద బంగ్లా.. అందులో అంత కంటే పెద్ద గార్డెన్.. అందులో హాయిగా సేదతీరుతూ ఉదయాన్నే టీ తాగుతూ గడపాలి. రెండోది స్కై డైవింగ్ చేయడం. ఆ మజాని ఆస్వాదించడం. ఇక మూడోది జాతీయ స్థాయి పురస్కారం అందుకోవాలి.. దాంతో పాటు చరిత్రలో నిలిచిపోయిన గొప్ప వ్యక్తి బయోపిక్​లో నటించాలి. ఈ మూడు కోరికలు త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నా" అంటోంది కృతి. అందుకోసం కష్టపడతానని చెబుతోంది.

కృతి సనన్, అక్షయ్ కుమార్ కలిసి నటిస్తున్న 'బచ్చన్​పాండే' వచ్చే ఏడాది విడుదల కానుంది. 'మిమీ', టైగర్ ష్రాఫ్​తో నటిస్తోన్న 'గన్​పథ్', 'భేడియా' చిత్రాల్లో నటిస్తోంది కృతి.

ABOUT THE AUTHOR

...view details