శంకర్ తన మొదటి చిత్రం 'జెంటిల్‌మేన్' కోసం కథానాయకుడిగా చిరంజీవిని కూడా అనుకున్నారట. కానీ, అప్పటి పరిస్థితుల్లో అది సాధ్యపడలేదు. ఆ సినిమా అర్జున్‌తో తీయగా.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అయితే, ఇదే కథను చిరంజీవితో హిందీలో 'ది జెంటిల్‌మేన్' పేరుతో మహేశ్‌భట్ తీశారు. ఆ తర్వాత చిరుతో శంకర్ కలిసి పనిచేసే అవకాశం రాలేదు. అయితే, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత చిరు తనయుడితో శంకర్ పనిచేస్తుండటం విశేషం. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..
* 'జెంటిల్‌మేన్'తో కెరీర్‌ను ప్రారంభించిన శంకర్ దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రామ్‌చరణ్‌తో తీస్తున్న సినిమా శంకర్‌కు 15వ సినిమా కావడం విశేషం.
* అలాగే 'చిరుత'తో ఎంట్రీ ఇచ్చిన రామ్‌చరణ్‌కు కూడా ఇది 15వ చిత్రమవడం గమనార్హం.
* దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఆ సంస్థకు ఇది 50వ సినిమా.
* శంకర్ తొలిసారి నేరుగా తెలుగులో అదీ తెలుగు హీరోతో సినిమా తీస్తున్నారు.
* చరణ్ - శంకర్ కలయిక, పాన్ ఇండియా స్థాయి సినిమాగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.