తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆ సినిమా తర్వాత నాపై ఒత్తిడి ఎక్కువైంది' - alluarjun pressure

'అల వైకుంఠపురములో' సినిమా విజయం తర్వాత తనపై ఒత్తిడి బాగా ఎక్కువైందని చెప్పారు హీరో అల్లు అర్జున్​. అభిమానుల్లో నెలకొన్న అంచనాలకు చేరువయ్యేలా 'పుష్ప' సినిమా కోసం డ్యాన్స్​, ఫైట్స్​పై మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు.

allu arjun
అల్లు అర్జున్​

By

Published : May 1, 2021, 10:13 PM IST

దక్షిణాదితో పాటు బాలీవుడ్​లోనూ ఐకాన్​ స్టార్​ అల్లుఅర్జున్​కు ఎంత క్రేజ్​ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటన, స్టైల్​, డ్యాన్స్​, ఫైట్స్​.. ఇలా అన్నింటిలో వైవిధ్యాన్ని చూపుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిసారిగా ఆయన 'అల వైకుంఠపురములో' సినిమాతో బిగ్గెస్ట్​ ​హిట్​ను అందుకున్నారు. త్వరలోనే సుకుమార్​ దర్శకత్వంలో పాన్​ ఇండియా సినిమాగా రూపొందుతున్న 'పుష్ప' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుకుమార్​-బన్నీ కలయికలో ఇప్పటికే వచ్చిన రెండు సినిమాలు హిట్​ అవ్వడం వల్ల.. పుష్పపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంతోనే నేరుగా ఆయన హిందీలోనూ ఎంట్రీ ఇవ్వనున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బన్నీ.. ఈ చిత్రం కోసం తాను బాగా కష్టపడుతున్నట్లు చెప్పారు. 'అల వైకుంఠపురములో' సినిమా విజయం తర్వాత తనపై ఒత్తిడి బాగా ఎక్కువైందని అన్నారు. అన్నీ భాషల్లో 'పుష్ప'పై అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలకు చేరువయ్యేలా.. డ్యాన్స్​, ఫైట్స్​ విషయంలో మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ సినిమాలో రష్మిక హీరోయిన్​. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ ఇది. మైత్రీమూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మలయాళ నటుడు ఫహాద్​ ఫాజిల్​ విలన్​గా నటిస్తున్నారు. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. కాగా, ఇటీవల బన్నీకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన స్వీయనిర్బంధంలో ఉన్నారు.

ఇదీ చూడండి:'తగ్గేదే లే' అంటున్న 'పుష్ప'రాజ్‌

ABOUT THE AUTHOR

...view details