పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ 'వకీల్‌సాబ్' చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులోని తొలి లిరికల్ వీడియో విడుదలై దాదాపుగా ఏడాది కావస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాలోని రెండో పాటను ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు ఇటీవల కొన్ని ఊహాగానాలు వచ్చాయి. దీనిపై సంగీత దర్శకుడు తమన్ క్లారిటీ ఇచ్చారు.
"ఫిబ్రవరి 14న వకీల్‌సాబ్ నుంచి ఎలాంటి పాటను విడుదల చేయడం లేదు. ఈ సినిమా పాటల ఆల్బమ్‌ను పూర్తి చేస్తున్నాం. దీనిపై అతి త్వరలోనే అప్డేట్స్ ఇస్తాం. నిర్మాణ సంస్థతో కలిసి ఉత్తమంగా ఔట్పుట్ ఇవ్వడానికి కష్టపడుతున్నాం".