తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఎప్పటికైనా ఎన్టీఆర్​తో సినిమా చేస్తా' - movie news

'తెల్లవారితే గురువారం' సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్న మణికాంత్.. చిత్రవిశేషాలను పంచుకున్నారు. ఎన్టీఆర్ 'ఆది' చూసిన తర్వాత డైరెక్టర్​ అవ్వాలనుకున్నట్లు తెలిపారు.

Thellavarithe guruvaram movie director manikanta interview
'ఎప్పటికైనా ఎన్టీఆర్​తో సినిమా చేస్తా'

By

Published : Mar 27, 2021, 7:01 AM IST

"నా దృష్టిలో కథే హీరో. కథ రాసుకున్నాక అది ఏ హీరోకైతే బాగుంటుందో వారికే వినిపిస్తా. అంతే తప్ప ఓ హీరోను అనుకోని స్క్రిప్ట్‌ రాయడం నచ్చదు" అని అన్నారు మణికాంత్‌. 'తెల్లవారితే గురువారం' చిత్రంతో తెలుగు తెరపై ఎంట్రీ ఇవ్వనున్న కొత్త దర్శకుడాయన. శ్రీసింహా హీరోగా నటించారు. ఈ సినిమా శనివారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు మణికాంత్‌. ఆ విశేషాలు..

* ఇదొక విభిన్నమైన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. తెల్లవారితే పెళ్లి అనగా.. పెళ్లి కొడుకు ఇంట్లో నుంచి పారిపోతాడు. మరి తనెందుకు పారిపోయాడు? ఆరోజు రాత్రి ఏం జరిగింది? అన్నది మిగతా కథ. సింహాతో పాటు మిగతా ఇద్దరి కథానాయికల పాత్రలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

* నాకు ఎన్టీఆర్‌ అంటే ఎంతో అభిమానం. ఆయన 'ఆది' చిత్రం చూశాకే దర్శకుడిగా మారాలని నిర్ణయించుకున్నా. నిజానికి 'తెల్లవారితే గురువారం'లో ఆయనతో వాయిస్‌ ఓవర్‌ చెప్పించాలనుకున్నా. కథానుగుణంగా హీరో చెప్తేనే బాగుంటుందని చెప్పించలేదు. ఎప్పటికైనా ఆయనతో సినిమా చేయాలనుంది.

ABOUT THE AUTHOR

...view details