తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సమయాభావం వల్లే.. వేరే కారణమేమీ లేదు' - Anushka bahuballi

మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది అనుష్క. ప్రస్తుతం స్వీటి నటించిన 'నిశ్శబ్దం' విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ నటి సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా కనిపించదు. తాజాగా ట్విట్టర్​లోకి ఎప్పుడొస్తారు అన్న ప్రశ్నకు స్పందించింది స్వీటి.

'సమయాభావం వల్లే.. వేరే కారణమేమీ లేదు'
'సమయాభావం వల్లే.. వేరే కారణమేమీ లేదు'

By

Published : Aug 29, 2020, 10:34 AM IST

మహిళా ప్రాధాన్య చిత్రాలంటే గుర్తొచ్చే నటి అనుష్క. 'అరుంధతి'లో జేజమ్మగా అలరించినా, 'బాహుబలి'లో దేవసేనగా కత్తి తిప్పినా తనకే చెల్లింది. ప్రస్తుతం ఆమె కీలక పాత్రలో నటించిన 'నిశ్శబ్దం' విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే, అనుష్క సామాజిక మాధ్యమాల్లో చాలా తక్కువగా కనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టా ద్వారా మాత్రమే అభిమానులకు చేరువగా ఉంది. మరి ట్విట్టర్​లోకి ఎప్పుడు వస్తారని ప్రశ్నిస్తే.. ఆమె సమాధానం ఏంటో తెలుసా?

"‘నాక్కొంచెం సిగ్గెక్కువే. సెట్లోకి వెళ్తే అన్నీ మర్చిపోతా గానీ, కొత్తవాళ్లతో అంత త్వరగా కలవలేను. సినిమాలు లేకపోతే ఇల్లే నా లోకం. బయట విషయాల గురించి అసలు పట్టించుకోను. ఇక సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండటానికి ప్రత్యేకంగా కారణాలేమీ లేవు. సమయాభావం వల్లే వాటికి దూరంగా ఉంటున్నా. అభిమానులు ట్విట్టర్​లోకి రమ్మని ఎప్పటి నుంచో అడుగుతున్నా.. అటు వైపు రాకపోవడానికి ఇదీ ఒక కారణం కావొచ్చు. నిజానికి దీని గురించి నేనింకా అవగాహన పెంచుకోలేదు. ఏదైనా చెప్పాలని నా మనసుకు అనిపించినప్పుడు తప్పక ట్విట్టర్​లో చేరతా. ఆ తర్వాత అభిమానులందరితో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటా" అంటూ చెప్పుకొచ్చింది స్వీటి.

ABOUT THE AUTHOR

...view details