తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Manchu Vishnu: సినీ నటుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ - Manchu Vishnu office

Manchu Vishnu: సినీ నటుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ జరిగింది. రూ.5లక్షల విలువ చేసే హెయిర్‌ డ్రెస్సింగ్‌ సామగ్రి చోరీకి గురయ్యాయి.

Manchu Vishnu
సినీ నటుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ

By

Published : Feb 28, 2022, 7:24 AM IST

Updated : Feb 28, 2022, 8:21 AM IST

Manchu Vishnu: సినీనటుడు మంచు విష్ణు వ్యక్తిగత హెయిర్‌ స్టైలిస్ట్‌పై జూబ్లీహిల్స్‌ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. మంచు విష్ణు వద్ద బోరబండకు చెందిన యు.నాగశ్రీను హెయిర్‌ సైలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న జూబ్లీహిల్స్‌ సీబీఐ కాలనీలోని కార్యాలయంలో విష్ణుకు చెందిన రూ.5లక్షల విలువైన హెయిర్‌ డ్రెస్సింగ్‌, మేకప్‌ సామగ్రిని చెప్పకుండా, ఎలాంటి అనుమతి లేకుండా తీసుకెళ్లాడు.

చరవాణిలో సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రావడం లేదు. చోరీకి పాల్పడినట్లు లీగల్‌ మేనేజర్‌ సంజయ్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఈనెల 19న ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: Mohanbabu: ట్రోలర్స్​కు మోహన్​బాబు లీగల్ నోటీసులు

Last Updated : Feb 28, 2022, 8:21 AM IST

ABOUT THE AUTHOR

...view details