తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సుశాంత్​ కేసులో పోలీస్ స్టేషన్​కు ఆదిత్యా చోప్రా

బాలీవుడ్ హీరో సుశాంత్​ మృతి కేసులో భాగంగా ప్రముఖ నిర్మాత ఆదిత్యా చోప్రా వాంగ్మూలాన్ని తీసుకున్నారు ముంబయి పోలీసులు. ఇదివరకే దర్శకుడు సంజయ్​ లీలా భన్సాలీ, తదితరులను పోలీసులు విచారించారు.

The statement of Aditya Chopra of Yash Raj Films recorded in Sushant Singh Rajput death case: Mumbai Police
సుశాంత్​

By

Published : Jul 18, 2020, 4:44 PM IST

సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్య కేసులో సినీ ప్రముఖుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. తాజాగా శనివారం బాలీవుడ్​ చిత్ర నిర్మాత ఆదిత్యా చోప్రా వాంగ్మూలాన్ని తీసుకున్నారు ముంబయి పోలీసులు. ఆదిత్య బ్యానర్​ యశ్​రాజ్​ ఫిలిమ్స్​తో సుశాంత్​ కుదుర్చుకున్న ఒప్పందాన్ని ముంబయి పోలీసులు ఇదివరకే పరిశీలించారు. ఇందులో నిర్మాణ సంస్థ సుంచి సుశాంత్​ మూడు చిత్రాలకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడైంది. అయితే ఆ ఒప్పందాలను ఎందుకు రద్దు చేసుకున్నారనే అంశంపై వివరణ ఇవ్వాలని ఆదిత్యా చోప్రాను పోలీసులు ప్రశ్నించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

జూన్​ 14న సుశాంత్ ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం ఈ నటుడి మరణానికి పలువురు సినీ ప్రముఖులు కారణమని న్యాయవాది సుధీర్​ కుమార్​ ఓజా కోర్టులో కేసు వేశారు. ఈ క్రమంలోనే ముంబయి పోలీసులు సుశాంత్​ మృతికి గల కారణాలపై విచారణ కొనసాగిస్తున్నారు. అయితే, కొంత మంది సినీ ప్రముఖులు, అభిమానులు సీబీఐ విచారణకు అనుమతి ఇవ్వాలని సామాజిక మాధ్యమాల వేదికగా డిమాండ్​ చేస్తున్నారు.

ఇదీ చూడండి:'ఆరోపణలు నిజం కాకపోతే పద్మ శ్రీ తిరిగిచ్చేస్తా'

ABOUT THE AUTHOR

...view details