తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రియాంక-కరీనా ముద్దులు.. నెట్టింట వైరల్ - kapoor kapoor with priyanka chopra

ఇటీవల హిందీ రియాలిటీ షో 'డ్యాన్స్​ ఇండియా డ్యాన్స్'​లో సందడి చేశారు బాలీవుడ్ నటీమణులు ప్రియాంక చోప్రా-కరీనా కపూర్. ఈ సందర్భంగా వీరిద్దరూ ముద్దుపెట్టుకున్నట్లు ఉన్న ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.

ప్రియాంక

By

Published : Sep 26, 2019, 1:21 PM IST

Updated : Oct 2, 2019, 2:00 AM IST

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'ద స్కై ఈజ్ పింక్'. ఈ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా ఇటీవల హిందీ రియాలిటీ షో 'డ్యాన్స్​ ఇండియా డ్యాన్స్​'లో పాల్గొందీ నటి. అక్కడ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోన్న కరీనా కపూర్​తో సరదాగా గడిపింది. వారిద్దరు కలిసి దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. అలాగే ప్రియాంక-కరీనా ముద్దు పెట్టుకున్నట్లు ఉన్న ఓ వీడియోను నెట్టింట పోస్ట్ చేసింది ప్రియాంక. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

హిందీ చిత్రాలకు విరామం ప్రకటించిన ప్రియాంక.. నిక్ జోనస్​ను పెళ్లి చేసుకుని హాలీవుడ్​లో బిజీగా మారింది. దాదాపు మూడేళ్ల తర్వాత 'ద స్కై ఈజ్​ పింక్'​తో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతుంది. సోనాలీ బోస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్, జైరా వాసీం కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ఇవీ చూడండి.. 'చంపడమో.. చావడమో కాదు గెలవడం ముఖ్యం'

Last Updated : Oct 2, 2019, 2:00 AM IST

ABOUT THE AUTHOR

...view details