తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రమ్యకృష్ణ 'కేజీఎఫ్​ 2'ను తిరస్కరించిందా..! - రమ్యకృష్ణ కేజీఎఫ్​ 2

'బాహుబలి' చిత్రంలో శివగామి పాత్ర పోషించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి రమ్యకృష్ణ. అప్పటి నుంచి పవర్​ఫుల్​ పాత్రలకు కేరాఫ్​గా మారిందీ నటి. తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్టులో అవకాశం వదులుకుందట రమ్యకృష్ణ. దానికి పారితోషికమే కారణమని సినీవర్గాల సమాచారం.

Ramya Krishna rejected the movie KGF 2
'కేజీఎఫ్​-2'లో రమ్యకృష్ణ లేనట్టేనా..!

By

Published : Feb 12, 2020, 5:14 PM IST

Updated : Mar 1, 2020, 2:42 AM IST

రమ్యకృష్ణ .. 'బాహుబలి' సినిమాతో ఒక్కసారిగా కెరీర్​ గ్రాఫ్​ పెంచుకుంది. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో శివగామి పాత్ర పోషించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అప్పటి నుంచి బలమైన పాత్రలకు కేరాఫ్​గా మారిందీ నటి. విభిన్న వేషాలు ఆవిష్కరించేందుకు ఎప్పుడూ ముందుండే ఈ సీనియర్ హీరోయిన్ తాజాగా 'కేజీఎఫ్​ 2'లో అవకాశం వదులుకుందట.

యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో 'కేజీఎఫ్‌'కు సీక్వెల్‌గా 'కేజీఎఫ్ 2' తెరకెక్కుతోంది. మొదటి భాగం ప్రేక్షకుల్ని అలరించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 'కేజీఎఫ్​-2'ను భారీ తారాగణంతో తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నాడు దర్శకుడు ప్రశాంత్​​.

'కేజీఎఫ్​-2'లో రమ్యకృష్ణ లేనట్టేనా..!

ఇప్పటికే బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సంజయ్‌ దత్, టాలీవుడ్‌ విలక్షణ నటుడు రావు రమేష్‌ను తీసుకుంది చిత్రబృందం. వీళ్లతోపాటే ఓ కీలకపాత్ర కోసం రమ్యకృష్ణను సంప్రదించగా ఆమె తిరస్కరించిందని టాక్​. రమ్యకు ఆ పాత్ర ఆకట్టుకున్నా.. పారితోషికం విషయంలో మనసు మార్చుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే రమ్యకృష్ణ స్థానంలో బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ను తీసుకున్నారని కన్నడ చిత్ర పరిశ్రమలో వినిపిస్తోంది. మరి రమ్య వద్దనుకున్న పాత్ర ఎలా ఉండబోతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇదీ చదవండి:బాహుబలి రికార్డుపై 'ఆర్ఆర్​ఆర్​' కన్ను!

Last Updated : Mar 1, 2020, 2:42 AM IST

ABOUT THE AUTHOR

...view details