తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఉదయాన్నే పొలం పనికి వెళ్తున్న శర్వానంద్! - శర్వానంద్​ శ్రీకారం సినిమా

హీరో శర్వానంద్​ 'శ్రీకారం' సినిమా ఫస్ట్​లుక్ ఆకట్టుకుంటోంది. వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

The release time is announced through the film's first look poster. Sreekaram first look poster is very pleasant and Sharwanand is seened as former
ఉదయాన్నే పొలం పనికి వెళ్తున్న శర్వానంద్!

By

Published : Jan 27, 2020, 3:11 PM IST

Updated : Feb 28, 2020, 3:40 AM IST

శర్వానంద్​.. విభిన్న కథలను ఎంపిక చేసుకొని, ప్రేక్షకులకు చేరువవుతున్న కథానాయకుడు. ప్రస్తుతం 'శ్రీకారం' అనే సినిమాలో నటిస్తూ, బిజీగా ఉన్నాడు. నేడు(సోమవారం) విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్​లుక్​లో రైతుబిడ్డగా ఆకట్టుకుంటున్నాడు.

ఇందులో శర్వానంద్​.. లుంగీ కట్టుకుని, భుజంపై టవల్‌తో పొలంలో నడుస్తూ కనిపిస్తున్నాడు. 'ఇతను మన కేశవుల కొడుకు.. పొద్దునే పొలం పనికి వెళ్తున్నాడు చూడండి' అనే వ్యాఖ్యను జోడించారు. అయితే శర్వా పాత్ర ఏంటో చెప్పకుండా ఆసక్తి పెంచింది చిత్ర బృందం. మరి శర్వా కూడా రైతుగా కనిపిస్తాడా, కొన్ని సన్నివేశాలకే పరిమితం అవుతాడా అనే విషయాలు తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఉదయాన్నే పొలం పనికి వెళ్తున్న శర్వానంద్!

ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ సంగీతమందిస్తున్నాడు. కిశోర్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ఇదీ చదవండి:కబడ్డీ కోచ్​గా మారిన హీరో గోపీచంద్

Last Updated : Feb 28, 2020, 3:40 AM IST

ABOUT THE AUTHOR

...view details