బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ తొలుత 'భారతీయుడు 2'లో నటించనున్నాడనే వార్తలొచ్చాయి. కానీ అది కుదరలేదు. అయితే ఈ చిత్రంలో జమ్వాల్ నటించకపోవడానికి కారణం వేరే ఉందట. 'ఇండియన్ 2'లో తను ఎందుకు నటించ లేదో తెలిపాడు.
"మొదట నన్ను 'ఇండియన్ 2'లో నటించమని అడిగారు. కానీ 'ఖుదా హఫీజ్' చిత్రం కోసం అప్పటికే సంతకం చేశాను. అందువల్లే 'ఇండియన్ 2'లో నటించే గొప్ప అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది."
-విద్యుత్ జమ్వాల్, బాలీవుడ్ నటుడు
త్వరలోనే శ్రుతి హాసన్, విద్యుత్ జమ్వాల్‌లు కలిసి మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఆ చిత్రానికి 'పవర్' అనే పేరు పెట్టారట. ప్రస్తుతం విద్యుత్ 'కమాండో 3' మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడీ హీరో. ఇందులో గుల్షన్ దేవయ్య, అంగిరా ధర్, ఆదా శర్మ తదితరులు నటిస్తున్నారు. డిసెంబర్ 29న తెరపైకి రానుందీ మూవీ.
ఇవి కూడా చదవడి: ఒకరిది రెట్రో లుక్.. మరొకరిది మోడ్రన్ స్టైల్