తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వాణిజ్య ప్రకటనల్లో బాలయ్య అందుకే కనిపించరా? - బాలకృష్ణ లేటెస్ట్​ న్యూస్​

తన జీవితంలో ఇప్పటివరకు వాణిజ్య ప్రకటనల్లో కనిపించకపోవడానికి బలమైన కారణముందని అంటున్నారు కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. ప్రేక్షకులు ఇచ్చిన పేరు ప్రఖ్యాతులను సంపద కోసం ఉపయోగించకూడదని నిశ్చయించుకున్నట్లు ఆయన తెలిపారు.

The reason behind Balakrishna's wasn't being a ambassador for any brand
వాణిజ్య ప్రకటనల్లో బాలయ్య అందుకే కనిపించరు!

By

Published : Jun 9, 2020, 7:14 AM IST

Updated : Jun 9, 2020, 8:28 AM IST

తెలుగు చిత్రసీమలో చాలామంది కథానాయకులు ఉన్నారు. వారిలో ఒక్కొక్కరిది ఒక్కో మనస్తత్వం. సినిమాలు ఎప్పుడైనా మనిషికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చేవిగా ఉండాలని చెబుతుంటారు నందమూరి బాలకృష్ణ. అయితే కొంతమంది హీరోలు వారికున్న క్రేజ్​తో సినిమాల్లోనే కాకుండా వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించి సందడి చేస్తుంటారు. అయితే బాలకృష్ణ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించలేదు. దానికి ఓ కారణం ఉందని అంటున్నారు బాలకృష్ణ.

"అసలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించకపోవడానికి చాలా పెద్ద కారణం ఉంది. మా నాన్న ఎన్టీఆర్‌ ఏనాడు వాణిజ్య ప్రకటనల్లో కనిపించలేదు. 'మనకు ఇంతటి పేరు ప్రఖ్యాతులను ఇచ్చింది ప్రేక్షక దేవుళ్లే. అలాంటి వారి నమ్మకానికి, అభిమానానికి వెల కట్టి, ప్రకటనల్లో నటించి.. మళ్లీ డబ్బు సంపాదించడం మంచిది కాద'న్నారు. అందుకే నేను ఆయన బాటలోనే నడుస్తున్నాను".

- బాలకృష్ణ, కథానాయకుడు

ఇప్పటి వరకు బాలకృష్ణ, రజనీకాంత్‌లు వాణిజ్య ప్రకటనల్లో కనిపించిన దాఖలాలు లేవు. ప్రజాప్రయోజనాలు, జనహితం కోసం జారీ చేసిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే హీరోహీరోయిన్లు చాలామంది ఉన్నారు.

ఇదీ చూడండి... మాస్క్​ పెట్టుకోనందుకు సైఫ్​, కరీనాపై విమర్శలు

Last Updated : Jun 9, 2020, 8:28 AM IST

ABOUT THE AUTHOR

...view details