తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Pushpa shooting: మరోసారి మారేడుమిల్లిలో 'పుష్ప' - alluarjun pushpa images

అల్లుఅర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'పుష్ప' చిత్రీకరణ (Puspha movie shooting update) చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్​ జరుపుతున్నారు. గతంలోనూ ఓ ముఖ్య షెడ్యూల్​ను ఇక్కడే పూర్తిచేశారు.

Puspha movie shooting update
పుష్ప సినిమా షూటింగ్​ అప్​డేట్స్​

By

Published : Sep 6, 2021, 7:11 AM IST

అల్లుఅర్జున్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం 'పుష్ప'(Puspha movie shooting update). దీని చిత్రీకరణ చివరి దశకు చేరింది. ఇటీవలే చిత్రబృందం ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి(pushpa movie shooting location) వెళ్లింది. అక్కడ కీలక యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గతంలోనూ ఓ ముఖ్య షెడ్యూల్‌ ఇక్కడే పూర్తిచేశారు. ప్రస్తుత షెడ్యూల్‌ అక్కడ నెలాఖరు వరకూ ఉంటుందని, తర్వాత హైదరాబాద్‌లో తీసే మరో షెడ్యూల్‌తో దాదాపు చిత్రీకరణ పూర్తవుతుందని తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ముత్తంశెట్టి మీడియాతో కలిసి నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన కథానాయిక. ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన 'దాక్కో దాక్కో మేక' పాట 50మిలియన్‌ వ్యూస్‌ను దాటిపోయింది. క్రిస్మస్‌కు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

ఇదీ చూడండి:దక్షిణాది చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఎందుకింత క్రేజ్​?

ABOUT THE AUTHOR

...view details