తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లాక్​డౌన్​లో ఊపందుకున్న ఓటీటీ ట్రెండ్​ - పొన్మగల్​ వందాల్​ సినిమా అప్​డేట్​

కరోనా లాక్​డౌన్​ కారణంగా దేశవ్యాప్తంగా సినిమా విడుదలలు, షూటింగ్​లు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో కొంతమంది నిర్మాతలు తమ చిత్రాలను డిజిటల్​ ప్లాట్​ఫాంపై విడుదల చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అమితాబ్​ నటించిన 'గులాబో సితాబో' ఆన్​లైన్​లో విడుదలకు సిద్ధమవగా.. ఇప్పుడా జాబితాలో పలు సినిమాలు క్యూ కట్టాయి.

The OTT Trend of Momentum in Lockdown
లాక్​డౌన్​లో ఊపందుకున్న ఓటీటీ ట్రెండ్​

By

Published : May 15, 2020, 1:14 PM IST

లాక్​డౌన్​ కారణంగా దేశవ్యాప్తంగా సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి. విడుదలకు సిద్ధమైన చిత్రాలన్నీ వెనుకంజ వేశాయి. లాక్​డౌన్​ ఎప్పడు ముగుస్తుందో తెలియని స్థితిలో నిర్మాతలు ఆన్​లైన్​ వేదికలను ఆశ్రయిస్తున్నారు. తమ సినిమాలను సరాసరి ఓటీటీల్లో రిలీజ్​ చేయడానికి రెడీ అవుతున్నారు.

బాలీవుడ్​ దిగ్గజం అమితాబ్ బచ్చన్​, ఆయుష్మాన్​ ఖురానా నటించిన 'గులాబో సితాబో' అమెజాన్​ ప్రైమ్​తో ఇప్పటికే ఒప్పందం కుదర్చుకోగా.. నవాజుద్దీన్​ సిద్దిఖీ, అనురాగ్​ కశ్యప్​ నటించిన 'ఘూమ్​కేటు' చిత్రాన్ని మే 22న జీ5 యాప్​లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పడదే జాబితాలో మరిన్ని సినిమాలు వచ్చి చేరాయి.

ప్రైమ్​ను ఆశ్రయించిన 'శకుంతల..'

గణిత శాస్త్రవేత్త 'శకుంతలా దేవి' బయోపిక్​ను త్వరలోనే అమెజాన్​ ప్రైమ్​లో విడుదల చేయనున్నామని తాజాగా ప్రకటించింది ఆ చిత్రబృందం. బాలీవుడ్​ నటి విద్యాబాలన్​ టైటిల్​ రోల్​ పోషించింది.

జూన్​ 19న పెంగ్విన్

ప్రముఖ దర్శకుడు కార్తిక్​ సుబ్బరాజు నిర్మాణంలో హీరోయిన్​ కీర్తి సురేశ్​ ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'పెంగ్విన్​'. ఈ సినిమాకు ఈశ్వర్​ కార్తిక్​ దర్శకత్వం వహించాడు. అమెజాన్​ ప్రైమ్​లో 'పెంగ్విన్​' సినిమా జూన్​ 19న విడుదల కాబోతుందని తాజాగా చిత్రబృందం ప్రకటన చేసింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్​ కానుంది.

'పొన్మగల్​ వందాల్'​ అదే బాట

నటుడు సూర్య నిర్మాణంలో ఆయన భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన తమిళ చిత్రం 'పొన్మగల్​ వందాల్​'. ఈ చిత్రాన్ని మే 29న అమెజాన్​ ప్రైమ్​ వేదికగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఇదీ చూడండి.. ఓటీటీలో విడుదలకు సిద్ధమైన 'గులాబో సితాబో'

ABOUT THE AUTHOR

...view details