అక్కినేని హీరో నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న రొమాంటిక్ చిత్రం 'లవ్‌స్టోరి'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పరిస్థితులు అంతా బాగుండి ఉంటే నేడు (ఏప్రిల్ 16) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురావాల్సింది. అయితే కరోనా సంక్షోభం కారణంగా చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను వెల్లడిస్తామని చెప్పింది.
మెగాస్టార్‌కు పోటీగా అక్కినేని వారసుడు! - ఆచార్య రిలీజ్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'లవ్‌స్టోరి'. కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. అయితే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఇదే అంటూ టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
మెగాస్టార్‌కు పోటీగా అక్కినేని వారసుడు!
'లవ్‌స్టోరి' చిత్రాన్ని మే 13న విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అదే రోజున మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' రిలీజ్ కానుంది. చిరు సినిమాకు పోటీగా 'లవ్‌స్టోరి'ని విడుదల చేస్తారా? లేదా కొద్దిరోజులు వేచి చూస్తారా? అనేది తెలియాల్సిఉంది. దీనిపై అధికార ప్రకటన ఇంకా రాలేదు.
ఇదీ చూడండి:'సెహరి' టీజర్.. 'జాతిరత్నాలు' వీడియో సాంగ్
Last Updated : Apr 16, 2021, 2:50 PM IST