'జబర్దస్త్' ద్వారా ఎంతోమంది ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్న బుల్లితెర నటుడు గెటప్ శ్రీను. ఈసారి హీరోగా అవతారం ఎత్తి అలరించేందుకు సిద్ధమయ్యాడు. గెటప్ శ్రీను హీరోగా, కృష్ణమాచారి దర్శకత్వంలో 'రాజుయాదవ్' చిత్రం తెరకెక్కుతోంది. అంకిత ఖారత్ కథానాయిక. సాయి వరుణవి క్రియేషన్స్ పతాకంపై ప్రశాంత్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్రబృందం పంచుకుంది. స్వీటీ.. అంటూ హీరోయిన్ వెనకాల రాజుయాదవ్ (గెటప్‌శ్రీను) పరుగెత్తుతూ ఆ వీడియోలో కనిపించాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. మీరూ చూసేయండి మరి.
గెటప్ శ్రీను కొత్త చిత్రం.. 'థ్యాంక్ యు బ్రదర్' రిలీజ్ డేట్ - థ్యాంక్ యూ బ్రదర్ సినిమా విడుదల
గెటప్ శ్రీను హీరోగా, కృష్ణమాచారి దర్శకత్వంలో 'రాజు యాదవ్' చిత్రం తెరకెక్కుతోంది. అంకిత ఖారత్ కథానాయిక. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అలాగే అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం 'థ్యాంక్ యు బ్రదర్' రిలీజ్ డేట్ ఖరారైంది.
అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం 'థ్యాంక్ యు బ్రదర్'. ఈ థ్రిల్లర్ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రమేశ్ రాపర్తి దీన్ని తెరకెక్కించారు. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' సమర్పణలో మాగుంట శరత్‌చంద్రారెడ్డి, తారక్ భూమిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. మౌనికారెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, వైవా హర్ష కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గుణ బాలసుబ్రమణ్యం సంగీతం అందించారు. కాగా.. యువ కథానాయకుడు నాగచైతన్య ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రత్యేకంగా వీక్షించి.. ట్రైలర్ చాలా బాగుందని ప్రశంసించారు. చిత్రం విడుదల తేదీని కూడా చై ప్రకటించారు.
ఇదీ చదవండి:లింగుస్వామి చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా రామ్!