బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతదేహం ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయవద్దని మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ ఫొటోలను చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, ఇది మంచి పద్ధతి కాదని పోలీసులు తెలిపారు. సదరు ఫొటోల ప్రసారం న్యాయస్థానాల మార్గదర్శకాలకు విరుద్ధమని.. అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సుశాంత్ సింగ్ ఫొటోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు! - sushanth singh death updates
హీరో సుశాంత్ సింగ్ మృతదేహానికి సంబంధించిన ఫొటోలు.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయొద్దని, ఇప్పటికే ఉన్నవాటిని తొలగించాలని మహారాష్ట్ర సైబర్‌క్రైమ్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
'సామాజిక మాధ్యమాల్లో సుశాంత్ మృతదేహం ఫొటోలను పెట్టొద్దు'
ఇప్పటికే పోస్ట్ చేసిన చిత్రాలను తొలగించాలని నెటిజన్లకు పోలీసులకు సూచించారు. సుశాంత్ సింగ్ ఇంట్లో తమకు ఎలాంటి నోట్ దొరకలేదని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా విషయాన్ని పంచుకున్నప్పుడు ఆ సమాచారాన్ని ముందుగా ధ్రువీకరించుకోవాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: