తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇది ఆడవాళ్లు మాత్రమే పరిష్కరించే సమస్య కాదు! - మహిళలపై లైంగిక దాడులు

స్త్రీలపై జరిగే లైంగిక వేధింపుల సమస్యపై మాట్లాడింది హాలీవుడ్ నటి మార్గోట్ రోబి. బాధితులైన స్త్రీలు మాత్రమే ఈ సమస్యను పరిష్కరించలేరని తెలిపింది.

మార్గోట్ రోబి
Margot Robbie

By

Published : Dec 21, 2019, 8:48 PM IST

"ప్రపంచంలో స్త్రీలపై జరిగే లైంగిక వేధింపులు ఆపడం ఒక్క మహిళల పని మాత్రమే కాదు, అందరి బాధ్యత" అని’ చెబుతోంది 'ది లెజెండ్‌ ఆఫ్‌ టార్జాన్‌' నటి మార్గోట్‌ రోబి. అంతర్జాతీయంగా ఆడవారిపై లైంగిక వేధింపులు అరికట్టే అంశంపై హాలీవుడ్‌ నటి రోబి ఓ ఆంగ్లమీడియా సమావేశంలో మాట్లాడింది.

"ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ప్రతి వ్యక్తి తనతో పనిచేసే మహిళలను తల్లిగా, చెల్లి, భార్య, స్నేహితురాలిగా భావించాలి. అప్పుడే సమస్యకు పరిష్కారం దొరకుతుంది. అంతేకానీ బాధితులైన స్త్రీలు మాత్రమే సమస్యను పరిష్కరించలేరు" అని చెబుతోంది.

డిసెంబర్‌ 13, 2019న విడుదలైన 'బాంబ్‌షెల్‌' అనే చిత్రంలో కైలా పోస్పిసిల్‌ పాత్రలో నటించి అలరించింది మార్గోట్‌ రోబి. ఈ సినిమా కూడా మహిళా ఉద్యోగులపై వారి యజమాని లైంగిక వేధింపుల నేపథ్యంలో తెరకెక్కిందే.

ఇవీ చూడండి.. పండగ సెట్లో నవ్వులే నవ్వులు.. మీరూ చూసేయండి

ABOUT THE AUTHOR

...view details