The Kashmir Files Director Vivek Agnihotri: 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఇటీవలే చేసిన వ్యాఖ్యలు మధ్యప్రదేశ్‌లో దుమారం రేపుతున్నాయి. "భోపాలీ అంటే స్థానిక వాడుక భాషలో 'స్వలింగ సంపర్కులు' అని అర్థం" అంటూ ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యల వీడియోక్లిప్ వైరల్ అవుతోంది.
ఈ వ్యాఖ్యలను సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సహా, పార్టీ రాష్ట్ర నేతలు తీవ్రంగా ఖండించారు. భోపాల్ నగరాన్ని వివేక్ అవమానించారని, ఇందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భోపాల్.. భోజ రాజు సాంస్కృతిక వారసత్వ నగరమని, కళలకు నిలయమని అన్నారు. అలాంటిది వివేక్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి.. నేరానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.