తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కొత్త సినిమాలో దుల్కర్- సోనమ్ కెమిస్ట్రీ అదుర్స్ - irfan khan

బాలీవుడ్ చిత్రం 'ది జోయా ఫ్యాక్టర్​'లోని మరో లుక్​ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. హీరోహీరోయిన్లుగా దుల్కర్​ సల్మాన్, సోనమ్ కపూర్ నటిస్తున్నారు.

కొత్త సినిమాలో దుల్కర్- సోనమ్ కెమిస్ట్రీ అదుర్స్

By

Published : Jul 29, 2019, 12:29 PM IST

మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా బాలీవుడ్​లో తెరకెక్కుతోన్న చిత్రం 'ది జోయా ఫ్యాక్టర్'. సోనమ్ కపూర్ హీరోయిన్​గా నటిస్తోంది. రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకు అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. అనుజా చౌహన్ రాసిన 'ది జోయా ఫ్యాక్టర్' నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆదివారం దుల్కర్​ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్​లో సినిమాకు సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేసింది హీరోయిన్ సోనమ్. వీరిద్దరూ ఈ పోస్టర్​లో చాలా కూల్​గా ఉన్నారు.

ఇందులో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ పాత్రలో కనిపించనున్నాడు దుల్కర్. యాడ్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్​గా కనిపించనుంది సోనమ్. అమిత్ తివారీ సంగీతాన్ని అందిస్తున్నాడు. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

గతంలో 'కార్వాన్' అనే హిందీ చిత్రంలో సహాయపాత్ర పోషించిన దుల్కర్​.. ఈ సినిమాతో కథానాయకుడిగా బాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు.

ఇది చదవండి: నెట్టింట్లో ఫేమస్​ అవుతున్న ఫేస్​యాప్​ ఛాలెంజ్

ABOUT THE AUTHOR

...view details