తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరోయిన్​ పరిణీతి చోప్రా ముఖంపై గాయం - adithi rao hydari

హీరోయిన్ పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో 'ద గర్ల్​ ఆన్​ ద ట్రైన్​' రీమేక్​గా తెరకెక్కుతున్న బాలీవుడ్​ సినిమా ఫస్ట్​లుక్ ఆకట్టుకుంటోంది.

హీరోయిన్​ పరిణీతి చోప్రా

By

Published : Aug 21, 2019, 7:17 PM IST

Updated : Sep 27, 2019, 7:31 PM IST

హాలీవుడ్​ హిట్ చిత్రం 'ద గర్ల్​ ఆన్​ ద ట్రైన్'లో నటిస్తోంది బాలీవుడ్​ హీరోయిన్​ పరిణీతి చోప్రా. ఈ సినిమా ఫస్ట్​లుక్​ను ఇన్​స్టాగ్రామ్​లో పంచుకుందీ భామ. ఓ ఫొటోలో ముఖంపై గాయంతో భయంగా కూర్చుని ఉన్న పరిణీతి.. ఎవరినో తీక్షణంగా చుస్తూ కనిపిస్తోంది.

పరిణీతి ముఖంపై గాయం!

మాతృకలో ఈ పాత్రని ఎమ్లీ బ్లంట్‌ పోషించింది. విడాకులు తీసుకున్న మహిళ మానసికంగా ఎదుర్కొన్న సమస్యల నేపథ్యంగా ఈ చిత్ర కథ నడుస్తుంది. ఇందులోని మరో కీలక పాత్రలో అదితీరావ్ హైదరీ నటిస్తోంది. గతవారమే లండన్​లో షూటింగ్​ ప్రారంభమైంది. రిభుదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రేక్షకుల ముందుకు వచ్చే ఏడాది రానుంది. 'జబారియా జోడి'తో ఇటీవలే సందడి చేసిన పరిణీతి చోప్రా.. సైనా నెహ్వాల్ బయోపిక్​లోనూ నటిస్తోంది.

ఇది చదవండి: సల్మాన్​తో అదరగొట్టిన స్టార్​... ఇప్పుడు 'సైరా'తో....

Last Updated : Sep 27, 2019, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details