ప్రభాస్, పూజాహెగ్డే జంటగా 'జిల్' ఫేం రాధాకృష్ణ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. 'ప్రభాస్ 20' పేరుతో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకొంటోంది. డార్లింగ్ నటిస్తోన్న ఈ మూవీ నుంచి ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందా? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
గతంలో చిత్రబృందం ప్రభాస్ ఫొటోను విడుదల చేసినప్పటికీ అందులో ముఖం కనిపించకపోవడం వల్ల అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇప్పుడు వారి కోసం ఫస్ట్‌లుక్ సరికొత్తగా తీర్చిదిద్దుతుంది చిత్రబృందం. ఉగాదిని పురస్కరించుకుని మార్చి 25న ప్రభాస్ ఫస్ట్‌లుక్ విడుదల చేయనున్నారని సమాచారం. ఈ చిత్రానికి 'ఓ డియర్', 'రాధే శ్యాం' పేర్లు పరిశీలనలో ఉన్నాయి.