విశ్వక్‌సేన్ హీరోగా శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'హిట్'. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాలో విశ్వక్‌సేన్ ఓ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి 'హిట్' అనే పేరును టైటిల్‌గా ప్రకటించగానే అసలు దాని వెనుక అర్థం కోసం చాలా మంది వెతికారు. తాజాగా 'హిట్' అంటే ఏంటో చెబుతూ చిత్రబృందం ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది.
ఓ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడిస్తూ విశ్వక్‌సేన్ ఆ వీడియోలో కనిపించాడు. కేసు పూర్తి వివరాలను 'హిట్'లో పెట్టనున్నట్లు తెలపగా, సర్ 'హిట్' అంటే ఏంటి అని ఓ విలేకరి ప్రశ్నించాడు. దానికి బదులుగా 'హోమ్ సైడ్ ఇంటర్వెన్షన్ టీమ్'.. అని దాని వెనుక ఉన్న అర్థాన్ని చెప్పాడు విశ్వక్.