తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలీవుడ్​ ప్రముఖులకు ఈ కార్లు ఎప్పటికీ ప్రత్యేకమే! - కాజోల్​ వాడిన తొలికారు

సినీ పరిశ్రమలో చాలా మంది సెలబ్రిటీలకు లగ్జరీ కార్లంటే విపరీతమైన ఇష్టం. దానికోసం కోట్లు ఖర్చు చేసి మరీ కొనుగోలు చేస్తుంటారు. అయితే గ్యారేజీలో ఎన్ని విలాసవంతమైన వాహనాలున్నా.. వారు వాడిన తొలి కార్లు అంటే ఎప్పటికీ ప్రత్యేకంగానే భావిస్తుంటారు. మరి ఆ బాలీవుడ్​ ప్రముఖులు వాడిన మొదటి కార్లు, వాటితో ఉన్న అనుబంధం ఏంటో తెలుసుకుందామా!

the first cars these Bollywood celebrities bought for themselves
బాలీవుడ్​ ప్రముఖలకు ఈ కార్లు ఎప్పటికీ ప్రత్యేకమే!

By

Published : Dec 12, 2020, 5:43 PM IST

సినీప్రముఖులు ఎక్కడికెళ్లినా అభిమానుల కళ్లు, కెమెరాలు తమ వైపే ఉండాలని ఆశిస్తారు. అందుకోసం వారు వినియోగించే ప్రతిదీ ఖరీదైనవిగా, అందంగా ఉండేలా చూసుకుంటారు. దుస్తులు, హ్యాండ్​ బ్యాగ్​లు, చెప్పులు ఇలా అన్నీ ఖరీదైనవే కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా వారు ప్రయాణించే కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖరీదైన లగ్జరీ కార్లలోనే ప్రయాణాలు చేస్తుంటారు.

అయితే కొంతమంది బాలీవుడ్​ సెలబ్రిటీలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారు. ఇంటి గ్యారేజ్​లో ఎన్ని విలాసవంతమైన వాహనాలున్నా.. వారు కొనుగోలు చేసిన తొలి కార్లతో తమకు ఎంతో అనుబంధం ఉందని అంటున్నారు. అలాంటి పాత జ్ఞాపకాలున్న ప్రముఖుల వివరాలేంటో తెలుసుకుందామా?

బాలీవుడ్​ సెలబ్రిటీలు వాడిన మొదటి కార్లు ఏవో మీరే చూడండి:

ప్రియాంకా చోప్రా (మెర్సిడెస్​ బెంజ్​ ఎస్​-క్లాస్​)

1) ప్రియాంకా చోప్రా (మెర్సిడెస్​ బెంజ్​ ఎస్​-క్లాస్​)

బాలీవుడ్​ నటి ప్రియాంకా చోప్రా జోనస్​ గ్యారేజీలో హైక్లాస్ మోడల్​​ కార్లు చాలా ఉన్నాయి. వాటిలో రోల్స్​ రాయిస్​ ఘోస్ట్​, మెర్సిడెస్​ ఎస్​ 650 మేబాచ్​, బీఎమ్​డబ్ల్యూ 7 సిరీస్​, పోర్స్​చే కయెన్​ వంటి విలాసంతమైన వాహనాలకు మెయిన్​టేన్​ చేస్తోందీ భామ. కార్టోక్​ నివేదిక ప్రకారం.. మొట్టమొదటగా మెర్సిడెస్​ బెంజ్​ ఎస్​-క్లాస్​ సెడాన్ అనే తెల్ల కారును ప్రియాంక కొనుగోలు చేసింది.

షారుఖ్​ ఖాన్​ (మారుతి ఓమినీ)

2) షారుఖ్​ ఖాన్​ (మారుతి ఓమ్నీ)

భారతీయ సినీ ప్రముఖుల్లో 'బుగాటీ వైరాన్'​ ఉన్న ఒకే ఒక హీరో షారుఖ్​ ఖాన్​. టైమ్స్​ ఆఫ్​ ఇండియా నివేదిక ప్రకారం.. ఈ బాలీవుడ్​ బాద్​షా​ గ్యారేజీలో ఎన్నో విలాసవంతమైన కార్లు ఉన్నా.. అతనికి మాత్రం మారుతి ఓమ్నీ అంటే ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే అది షారుఖ్​కు తన తల్లి ఇచ్చిన బహుమతి అని తెలుస్తోంది. షారుఖ్​ వాడిన మొదటి కారు కూడా ఇదే కావడం విశేషం.

ఆలియా భట్​ (ఆడి ఏ6)

3) ఆలియా భట్​ (ఆడి ఏ6)

బాలీవుడ్​ బ్యూటీ ఆలియా భట్​.. 2015లో తాను తొలి కారు కొనుగోలు చేసినట్లు సోషల్​మీడియాలో ఓ ప్రకటన చేసింది. ఆమె సంపాదనతో 'ఆడి ఏ6' బూడిద రంగు కారును తన గ్యారేజీలోకి ఆహ్వానించింది. అయితే ఆమెకు అప్పటికే 'బీఎండబ్ల్యూ 7 సిరీస్​', 'ఆడి క్యూ7', 'ల్యాండ్​ రోవర్​ రేంజ్​ రోవర్ వోగ్​​' వాహనాలున్నాయి.

అమితాబ్​ బచ్చన్​ (ఫియట్​​)

4) అమితాబ్​ బచ్చన్​ (ఫియట్​​)

బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​ గ్యారేజ్​లో రోల్స్​ 'రాయిస్​ ఫాంటమ్​', 'ల్యాండ్​ రోవర్​ రేంజ్ రోవర్​ వోగ్​', 'పోర్స్​చే కేమాన్​ ఎస్​', 'బెంట్లీ కాంటినేన్​టల్​ జీటీ' వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి. టైమ్స్​ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. అమితాబ్​ మొదటిసారి ఫియట్​ కారును సెకండ్​ హ్యాండ్​లో కొనుగోలు చేశారు.

అక్షయ్​ కుమార్​ (ఫియట్​)

5) అక్షయ్​ కుమార్​ (ఫియట్​)

టైమ్స్​ ఆఫ్​ ఇండియా నివేదిక ప్రకారం.. అమితాబ్​ బచ్చన్​ తర్వాత ఫియట్​ కారును తొలిసారి వాడిన సినీప్రముఖుల్లో అక్షయ్​కుమార్​ ఒకరు. తాను కొన్ని తొలి కారు ఫియట్​ అని షిర్డీలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ప్రస్తుతం ఆయన దగ్గర కోట్ల రూపాయలు విలువ చేసే 'పోర్స్​చే కయెన్​', 'మెర్సిడెస్​ బెంజ్​ వీ-క్లాస్'​, 'రోల్స్​ రాయిస్​ ఫాంటమ్​ 7' వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి.

కత్రినా కైఫ్​ (ఆడి క్యూ7)

6) కత్రినా కైఫ్​ (ఆడి క్యూ7)

కార్టోక్​ నివేదిక ప్రకారం.. బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ నడిపిన మొదటి కారు 'ఆడి క్యూ7' మోడల్​. 3 లీటర్​ వీ6 డీజిల్​ ఇంజిన్​తో నడిచే ఈ కారులో క్రూయిజ్ కంట్రోల్​తో పాటు ఎలక్ట్రికల్లీ అడ్జస్టెడ్​ సీట్స్​, హిల్​ హోల్డ్​ అసిస్ట్​ వంటి ఫీచర్లు అందులో ఉన్నాయి. ఆమె గ్యారేజీలో 'ఆడి క్యూ7'తో పాటు 'ల్యాండ్​ రోవర్​ రేంజ్​ రోవర్​ వోగ్​ ఎల్​డబ్ల్యూబీ', 'మెర్సిడెస్​ ఎంఎల్​ 350' వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి.

కాజోల్​ (మారుతి సుజుకి 1000)

7) కాజోల్​ (మారుతి సుజుకి 1000)

బాలీవుడ్​ నటి కాజోల్​ తొలిసారి కొనుగోలు చేసిన కారు 'మారుతి సుజుకి 1000'. ఈ విషయాన్ని 2017లో ఇన్​స్టాగ్రామ్​లో ఆమె స్వయంగా తెలియజేసింది. ఆ కారే తన మొదటి ప్రేమ అని కారుపై కూర్చుని ఫొజులిచ్చిన ఫొటోను అభిమానులతో పంచుకుంది.

ఇదీ చూడండి:అట్టహాసంగా మొదలై.. అర్ధాంతరంగా ఆగిపోయిన సినిమాలు!

ABOUT THE AUTHOR

...view details