తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వాయిదా.. దర్శకులు క్లారిటీ - 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వాయిదా న్యూస్

గత కొన్నిరోజుల నుంచి వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వాయిదా పడింది. రానున్న వేసవిలో ఓటీటీ వేదికగా సందడి చేయనుందని టీమ్ తెలిపింది.

The Family Man Season 2 postponed, confirm Raj and DK
'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వాయిదా.. దర్శకులు క్లారిటీ

By

Published : Feb 5, 2021, 3:49 PM IST

'ద ఫ్యామిలీ మ్యాన్' రెండో సీజన్​ విడుదలపై దర్శక ద్వయం రాజ్-డీకే స్పష్టతనిచ్చారు. ఈ ఏడాది వేసవిలో అభిమానుల ముందుకు వస్తుందని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.

దర్శకులు రాజ్-డీకే ట్వీట్

గత నెల న్యూయర్ సందర్భంగా కొత్త పోస్టర్​ను 'ద ఫ్యామిలీ మ్యాన్' టీమ్ పంచుకుంది. అనంతరం కొన్నిరోజులకు ఓ టీజర్​ విడుదల చేయడం సహా ఫిబ్రవరి 12 నుంచి అమెజాన్ ప్రైమ్​లో కొత్త సీజన్ స్ట్రీమింగ్ కానుందని తెలిపింది.

అయితే రిలీజ్​ డేట్ దగ్గరపడుతున్నప్పటికీ ట్రైలర్​ను విడుదల చేయకపోవడం వల్ల అభిమానులకు పలు అనుమనాలు వచ్చాయి. రెండో సీజన్​ను ఏమైనా వాయిదా వేశారా అంటూ చర్చించుకున్నారు. వాళ్లు అనుకున్నట్లుగానే దర్శకులు ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చారు.

ఇందులో సమంత, మనోజ్ భాజ్​పాయ్, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఇది చదవండి:'ద ఫ్యామిలీ మ్యాన్ 2' టీజర్: సమంత పాత్ర ఏంటి?

ABOUT THE AUTHOR

...view details