తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ది ఫ్యామిలీ మ్యాన్​ 2' షూటింగ్ పూర్తి - ది ఫ్యామిలీ మ్యాన్​ 2

గతేడాది డిజిటల్​ ఫ్లాట్​ఫాంలో విడుదలైన 'ది ఫ్యామిలీ మ్యాన్​' వెబ్​సిరీస్ విశేషాదరణ దక్కించుకుంది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన రెండో సీజన్​ షూటింగ్​ పూర్తిచేసుకుని రిలీజ్​కు సిద్ధంగా ఉంది.

'The Family Man' S2 completes shoot
'ది ఫ్యామిలీ మ్యాన్​ 2' విడుదలకు సిద్ధం

By

Published : Mar 2, 2020, 8:41 PM IST

Updated : Mar 3, 2020, 5:03 AM IST

అమెజాన్​ డిజిటల్​ ఫ్లాట్​ఫాం నిర్మిస్తున్న 'ది ఫ్యామిలీ మ్యాన్​ 2' వెబ్​సిరీస్​ చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్ని దర్శకులు రాజ్​, డీకే ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ప్రకటించారు.

ఈ వెబ్​సిరీస్​.. జాతీయ దర్యాప్తు సంస్థలో రహస్యంగా పనిచేసే ఓ మధ్యతరగతికి చెందిన వ్యక్తి జీవితంతో తెరకెక్కింది. మనోజ్​ బాజ్​పాయ్​ ప్రధానపాత్రలో నటించాడు.

సమంత కీలకపాత్ర

నటి సమంత 'ఫ్యామిలీ మ్యాన్ 2​' ద్వారా డిజిటల్​ వేదిక​పై పరిచయమౌతోంది. మొదటి సీజన్​లో ప్రియమణి, షరీబ్​ హష్మి, నీరజ్​ మాధవ్​, పవన్​ చోప్రా, కిషోర్​ కుమార్​, గుల్​పాంగ్​ నటించారు. గతేడాది సెప్టెంబరు 20న మొదటి సీజన్​ విడుదలై ప్రేక్షకుల నుంచి​ విశేషాదరణ పొందింది.

ఇదీ చూడండి.. పవర్ స్టార్ వచ్చేశాడు.. అదిరిపోయిన 'వకీల్ సాబ్' ఫస్ట్​లుక్

Last Updated : Mar 3, 2020, 5:03 AM IST

ABOUT THE AUTHOR

...view details