తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఉగ్రవాది పాత్రలో సమంత.. దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు - ఆహా! లో సమంత టాక్ షో

'ద ఫ్యామిలీ మ్యాన్' సీక్వెల్​లోని సమంత పాత్ర గురించి ఆసక్తికర సంగుతుల్ని చెప్పారు దర్శకుల్లో ఒకరైన రాజ్. ఇందులో ఆమె చాలా యాక్షన్ సీన్స్ చేసిందని, అభిమానుల్ని ఆ పాత్ర కచ్చితంగా ఆకట్టుకుంటుందని అన్నారు.

The Family man director Raj big statement on Samantha Akkineni in Sam Jam talk show
'నెగటివ్​ రోల్​లో సమంత అదరగొట్టింది'

By

Published : Dec 14, 2020, 7:51 PM IST

'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్​తో హీరోయిన్ సమంత.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఉగ్రవాది పాత్రలో కనిపించనున్న ఈ భామ.. వీక్షకులను ఆశ్చర్యపరచనుంది. ఈ క్రమంలో సామ్ హోస్ట్​గా ఉన్న 'సామ్ జామ్​' టాక్ షోకు వచ్చిన సిరీస్​ దర్శకుల్లో ఒకరైన్ రాజ్ నిడుమోరు.. సమంత పాత్ర గురించి వెల్లడించారు.

'ఫ్యామిలీ మ్యాన్' సీక్వెల్​లోని ఉగ్రవాది పాత్ర​ కోసం సమంతను సంప్రదించినప్పుడు ఆమె చాలా ఉత్సాహం చూపించారని రాజ్ చెప్పారు. ఓ యాక్షన్ సీన్​ షూటింగ్​ చేస్తున్నప్పుడు ఆమె నిజంగానే నెగటివ్​గా మారిందా అనే అనుమానం తనకు వచ్చిందని అన్నారు. గతంలో ఈ విధంగా హీరో నాగార్జున చేసేవారని తెలిపారు.

ఇదీ చదవండి:యూట్యూబ్‌ టాప్‌10‌లో నిలిచిన తెలుగు పాటలు ఇవే

ABOUT THE AUTHOR

...view details