'కేరాఫ్ కంచరపాలెం' వంటి విభిన్న కథా చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమ్యాడు వెంకటేశ్ మహా. ప్రస్తుతం అతడు తెరకెక్కిస్తోన్న మరో సినిమా 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'. మలయాళంలో విజయవంతమైన 'మాహేశింతే ప్రతీకారమ్' మూవీ రీమేక్‌గా తెలుగులో రానుందీ చిత్రం. తాజాగా ఈ సినిమా టైటిల్ వెనుక కథను సామాజిక మాధ్యమంలో పంచుకున్నాడు దర్శకుడు.
'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..' వెనుక అర్థం ఇదే! అందుకే ఈ పేరు పెట్టారు..
'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..' వెనుక అర్థం ఇదే! ఉమా మహేశ్వరుడు అంటే ఉమా సహిత మహేశ్వరుడు, శుద్ధ సాత్విక స్వభావి అని అర్థం... ఈ చిత్రంలో హీరో అలాంటి స్వభావంతో ఉంటాడు కాబట్టే అదే పేరును టైటిల్‌గా పెట్టినట్లు తెలిపాడు దర్శకుడు వెంకటేశ్.
సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నరేశ్ కీలకపాత్రలో కనిపించనున్నాడు. శోభూ యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాను నిర్మించిన ఆర్యా మీడియా వర్స్క్ బ్యానర్‌పై తెరకెక్కుతోందీ చిత్రం. ఇటీవలే ఇందుకు సంబంధించిన టీజర్‌ను విడుదలైంది. ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
ఇదీ చదవండి:కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్న బాలీవుడ్ భామలు