తెలంగాణ

telangana

By

Published : Oct 19, 2019, 7:02 AM IST

ETV Bharat / sitara

అమితాబ్​ కోసం 14 ఏళ్లుగా ఉపవాస వ్రతం!

ఆయన బిగ్​ బీకి విరాభిమాని. అభిమానం అంటే సాదాసీదా అభిమానం కాదండీ బాబు. ఆడవారు భర్త శ్రేయస్సు కోసం చేసే వ్రతాన్ని 14 ఏళ్లుగా ఆయన అమితాబ్​ బచ్చన్​ కోసం చేసేంత అభిమానం. ఓ సినిమాలో అమితాబ్​ చెప్పిన ఆ ఒక్క డైలాగ్​ వల్ల ఆయన ఇలా ఏటా ఉపవాసం ఉండి మరీ, నిష్టగా వ్రతాన్ని ఆచరిస్తున్నారు.

అమితాబ్​ కోసం 14 ఏళ్లుగా ఉపవాస వ్రతం!

అమితాబ్​ కోసం 14 ఏళ్లుగా ఉపవాస వ్రతం!

ఉత్తర్​ప్రదేశ్​ బరేలీకి చెందిన 40 ఏళ్ల గోవర్ధన్​ భోజ్​వాణీ ఏటా కర్వాచౌత్​ పర్వదినాన అమితాబ్​ బచ్చన్​ కోసం ఉపవాస దీక్ష చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 ఏళ్లుగా ఇలా తన అభిమానాన్ని చాటుతూ వస్తున్నారు ఈ బిగ్​ బీ​ ఫ్యాన్​.

నీ వెంటే నేనుంటా!

గోవర్ధన్ గుండెల్లోనే కాదు, రూపంలోనూ బిగ్​బీ ప్రతిబింబిస్తారు. గడ్డం, వేషధారణ సర్వం ​బచ్చన్​ నుంచి ప్రేరణపొందినవే. ఆలోచనల్లోనూ ఆయన్నే అనుసరిస్తారు ఈయన. అడుగడుగునా అమితాబ్​ను ఆరాధిస్తారు.
2005లో బాక్సాఫీస్​ను కుదిపేసిన సినిమా 'బాఘ్​బాన్' చూసి బిగ్​బీ పట్ల అపారమైన ప్రేమ పెంచుకున్నారు భోజ్​వాణీ. అప్పటి నుంచే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను అంటున్నారు ఆయన.​

"అమితాబ్​ బచ్చన్​ సూత్రాలు మాతో పాటు కలకాలం ఉండాలి. మాకు మర్గదర్శకంగా నిలవాలి. ఆయన్నుంచి మరెన్నో మంచి మాటలు నేర్చుకోవాలని కోరుతూ నేను కర్వాచౌత్​ వ్రతం ఆచరిస్తాను. బాఘ్​​బాన్​ సినిమాలో కూడా ఆయన ఇదే చెప్పారు. భార్య కోసం భర్త కూడావ్రతం చేయాలన్నారు. అందుకే నేను నా భార్య కోసం, మా అమితాబ్​ కోసం వ్రతం చేస్తాను."
-గోవర్ధన్​ భోజ్​వాణీ

ఇదీ చూడండి:12 ఏళ్లకు కురవంజీలు విరిసే- కొండాకోనా మురిసే!

ABOUT THE AUTHOR

...view details