తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విజయ్ రూ.25 లక్షల్ని రూ.43 లక్షలకు పెంచారు - vijay middle class fund

విజయ్ దేవరకొండ 'మిడిల్ క్లాస్ ఫండ్'కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై ట్వీట్ చేసిన విజయ్.. ఒక్కరోజులోనే రూ.18 లక్షలుకుపైగా విరాళాలు వచ్చాయని చెప్పాడు.

విజయ్ రూ.25 లక్షల్ని రూ.43 లక్షలకు పెంచారు
విజయ్ దేవరకొండ

By

Published : Apr 27, 2020, 4:18 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునేందుకు యువహీరో విజయ్ దేవరకొండ స్థాపించిన ఫౌండేషన్‌కు దాతలు తమ వంతు సాయం చేస్తున్నారు. ఈ విషయాన్ని విజయ్‌ స్వయంగా ట్వీట్ చేశాడు. ఆదివారం సాయంత్రం తొమ్మిది గంటలకు మొత్తంగా రూ.18,74,805 విరాళాలు అందినట్లు వెల్లడించాడు. తమవంతు సాయంగా 1800 మంది విరాళం బదిలీ చేశారని అన్నాడు. ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు మిడిల్‌ క్లాస్‌ ఫండ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పారదర్శకంగా అప్‌డేట్‌ చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

'ఇవాళ నేను మ్యాజిక్‌ చూశా. మిడిల్‌ క్లాస్‌ ఫండ్‌ విజయం మీకే చెందుతుంది. కేవలం ఒక్కరోజులో నా రూ.25 లక్షల్ని రూ.43+ లక్షలు చేశారు' అని విజయ్ చెప్పాడు.

ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను ఆదుకునేందుకు విజయ్‌ రూ.25 లక్షల మూలనిధితో ‘మిడిల్ క్లాస్ ఫండ్’ను ఏర్పాటు చేశాడు. దీని ద్వారా సామాన్యులు, మధ్యతరగతి వారికి కావల్సిన నిత్యావసర సరుకులను కొనుగోలుచేసి ఇవ్వనున్నట్లు చెప్పాడు. ఇందుకోసం దేవరకొండ ఫౌండేషన్ పేరుతో ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లో (www.thedeverakondafoundation.org) అత్యవసరమున్న వారు వివరాలు నమోదు చేసుకోవాలని సూచించాడు. ఈ లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో తమ బృందం ఇంటిదగ్గరికి వచ్చి సహాయం చేయలేదు కాబట్టి.. సహాయార్థులు ఎవరైనా వాళ్లింటి దగ్గర దుకాణాల్లో సరకులు కొనుగోలు చేస్తే ఆ మొత్తాన్ని ఫండ్‌ నుంచి చెల్లిస్తామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details