బాలీవుడ్ సినిమా 'మైదాన్' కోసం ముంబయిలో వేసిన భారీ సెట్‌ను కూల్చేయనున్నారు. లాక్డౌన్ వల్ల నిరుపయోగంగా మారడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. వర్షాకాలం వచ్చేలోపు ఈ పని పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ విషయాన్ని నిర్మాత బోనీ కపూర్ కూడా ధ్రువీకరించారు. మళ్లీ ఇలాంటి సెట్‌ను రూపొందించాలంటే కనీసం రెండు నెలలైనా పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫుట్‌బాలర్ అబ్దుల్ సయీద్ రహీం జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. అమిత్ శర్మ దర్శకుడు. ఫుట్‌బాల్‌కు స్వర్ణయుగంగా చెప్పుకునే 1952-1962 మధ్యే ఈ కథంతా ఉండనుంది. ఇందులో ప్రియమణి, గిరిజ రావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 11న విడుదల కావాల్సి ఉంది. కరోనా వల్ల అదికాస్త ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.