ఆమె ఆందమైన, తెలివిగల ఓ వ్యాపార వేత్త. అనుకోకుండా హత్యకు గురవుతుంది. పోలీసులు విచారణకు పిలిచినప్పుడు ఆమె భర్త ఏదో దాయటానికి ప్రయత్నిస్తున్నాడు. మరి హత్య చేసింది అతడేనా? కాదా?.. ఈ విషయం తెలియాలంటే ‘'ది బాడి'’ చిత్రం విడుదల వరకు ఎదురుచూడాల్సిందే. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.
ఆమెను హత్య చేసింది అతడేనా? - తెలుగు సినిమా వార్తలు
బాలీవుడ్ కథానాయకుడు ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రలో నటించిన 'ది బాడి' సినిమా ట్రైలర్ విడుదల చేసింది చిత్ర బృందం. ఉత్కంఠ భరితంగా సాగే ఈ ట్రైలర్.. సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.
ఆమెను హత్య చేసింది అతనేనా?
బాలీవుడ్ నటుడు రిషికపూర్ పోలీసు అధికారిగా నటించాడు. ఉత్కంఠభరితంగా సాగే ట్రైలర్‌లో ఇమ్రాన్ హష్మి ముద్దులు కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో శోభిత ధూళిపాళ్ల కథానాయికగా నటిస్తోంది.
ఇది చదవండి: 'జాన్' బాలీవుడ్‌కు వెళ్లడా.. కారణం ఇదేనా..?
Last Updated : Nov 15, 2019, 6:51 PM IST