తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'లింగ భేదంతో సంబంధం లేని ఆకర్షణ నాది' - The actor-model Cara Delevingne says she identifies as pansexual

ఇంగ్లీష్​ మోడల్​, నటి కారా డెలెవింగ్నే.. తన వ్యక్తిగత విషయాలను బహిరంగంగా వెల్లడించింది. తను లింగ భేదం లేకుండా అందరికీ ఆకర్షితమయ్యే 'పెన్​సెక్సువల్'​గా పేర్కొంది.

Cara Delevingne news
'లింగ భేదంతో సంబంధం లేకుండా ఆకర్షితమైపోతాను'

By

Published : Jun 6, 2020, 10:09 AM IST

లింగం, వయస్సు సంబంధం లేకుండా అందరికీ ఆకర్షితమయ్యే 'పెన్​సెక్సువల్'​గా తన గురించి పేర్కొంది హాలీవుడ్​ నటి కారా డెలెవింగ్నే.

"సమస్యంతా నాలోనే ఉంది. నేను చాాలా మారిపోతున్నా. ప్రతిసారి విభిన్నమైన ఆలోచనలు వస్తున్నాయి. ఒక్కోసారి మహిళగా, మరోసారి పురుషుడిగా భావన కలుగుతోంది. అందుకే నా గురించి నేను పెన్​సెక్సువల్​గా భావించుకుంటాను" అని చెప్పింది కారా. 2016లో వచ్చిన 'సూసైడ్​ స్వాడ్' సినిమా​ ద్వారా మంచి పేరు సంపాదించుకుంది ఈ అమ్మడు.

గతంలోనూ తను ద్విలింగ సంపర్కురాలిగా తెలిపింది కారా. ఆష్లే బెన్​స్టన్​తో రెండేళ్ల డేటింగ్​ అనంతరం ఇటీవలె తమ బంధానికి గుడ్​బై చెప్పింది.

ఇదీ చూడండి: ఏం చేసినా 'రంభ'కే చెల్లింది.. అందుకే గ్లామర్​క్వీన్​

ABOUT THE AUTHOR

...view details