"దర్శకుడిగా(raja vikramarka karthikeya) అన్ని రకాల జానర్లు ప్రయత్నించాలి అనుకుంటున్నా. అయితే ఏ జానర్ సినిమా చేసినా.. అందులో వినోదం పక్కాగా ఉండేలా చూసుకుంటాను" అన్నారు శ్రీ సరిపల్లి(raja vikramarka new movie). 'రాజా విక్రమార్క' చిత్రంతో తెరకు పరిచయమవుతున్న కొత్త దర్శకుడాయన. కార్తికేయ, తాన్యా రవిచంద్రన్ జంటగా నటించిన ఈ సినిమాను రామారెడ్డి, ఆదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే విలేకర్లతో చిత్ర విశేషాలను తెలిపారు శ్రీ సరిపల్లి.
"నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)లో కొత్తగా చేరిన కుర్రాడి కథ ఇది(raja vikramarka story). అతను విచారణ చేసే క్రమంలో పొరపాటున ఆయుధాలు అమ్మే ఓ వ్యక్తిని చంపేస్తాడు. చనిపోవడానికి ముందు ఆ వ్యక్తి ఓ భారీ కుట్రకు సంబంధించిన సగం సమాచారాన్ని అందిస్తాడు. మరి ఆ మిగిలిన సమాచారాన్ని హీరో ఎలా కనుగొన్నాడు? ఈ క్రమంలో అతనికెదురైన సవాళ్లేంటి? ప్రత్యర్థుల కుట్రని ఎలా భగ్నం చేశాడు? అన్నది మిగిలిన కథ. యాక్షన్‌తో పాటు వినోదానికి ప్రాధాన్యమిస్తూ ఆసక్తికరంగా ఈ కథ సిద్ధం చేశా. హాలీవుడ్ సినిమా 'మిషన్ ఇంపాజిబుల్', తెలుగులో వచ్చిన 'నిర్ణయం' తరహాలో ఈ చిత్రం కనిపిస్తుంది. నా దృష్టిలో ఇదొక మినీ 'మిషన్ ఇంపాజిబుల్' అని చెప్పొచ్చు".
"ఈ చిత్రంలో వినోదం కథలో భాగంగానే ఉంటుంది తప్ప ఎక్కడా బలవంతంగా ఇరికించినట్లు ఉండదు. ద్వితియార్ధం చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ కథ రాసుకునేటప్పుడు ఎవరైనా యువ హీరోతో చేయాలని అనుకునేవాణ్ని. కార్తికేయను(Rx 100 movie hero name) చూశాక ఈ కథకి తను సరిగ్గా సరిపోతాడనిపించింది. 'ఆర్‌ఎక్స్ 100'(rx100 movie review) సినిమా విడుదల సమయంలో ఆయనకి ఈ కథ చెప్పా. స్క్రిప్ట్ నచ్చి తనే స్వయంగా నిర్మించాలనుకున్నారు. ఈలోపు వేరే ప్రాజెక్ట్‌లు ముందుకు రావడం వల్ల.. ఇది కాస్త ఆలస్యమైంది. ఈలోపు రామారెడ్డి, ఆదిరెడ్డి నిర్మించడానికి ముందుకొచ్చారు. ఈ సినిమాని కరోనాకు ముందే ప్రారంభించాం. మధ్యలో రెండు లాక్‌డౌన్‌లు రావడం వల్ల చిత్రీకరణ ఆలస్యమైంది. నిజానికి ఈ సినిమా చిత్రీకరణని 70రోజుల్లోనే పూర్తి చేశాం".