తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆదిత్య 369'లో కమల్ కుదరదన్నాడు ఎందుకు? - telugu latest news

తెలుగు సినీ పరిశ్రమలో మైలురాయిగా నిలిచిన సినిమాల్లో ఆదిత్య 369 ఒకటి. ఈ సినిమాలో బాలకృష్ణ తన విలక్షణమైన నటనతో రెండు పాత్రలు పోషించి ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యేలా చేశాడు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ నటించిన ఓ పాత్రలో హీరో కమల్​ హాసన్​ నటించాల్సి ఉందట.. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు.

ఆదిత్య 369లో కమల్ కుదరదన్నాడు ఎందుకు?

By

Published : Nov 16, 2019, 6:31 AM IST

టాలీవుడ్‌ సినీఆణిముత్యాల్లో బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘ఆదిత్య 369’ ఒకటి. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో వచ్చిన తొలి సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. టైం మెషీన్‌ కథాంశంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి అందించారు సింగీతం. శ్రీ కృష్ణ దేవరాయ, కృష్ణ కుమార్‌గా బాలకృష్ణ తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఇలాంటి పాత్రల్లో మరో నటుడ్ని ఊహించుకోలేం కదా! అంతగా ఆకట్టుకున్నాడు బాలయ్య.

కృష్ణమోహన్‌గా కమల్‌ హాసన్‌ అయితే ఎలా ఉండేది? ఇప్పుడు ఆయనెందుకంటారా.. శ్రీ కృష్ణ దేవరాయగా బాలయ్య మాత్రమే నటించగలడని, తను మాత్రమే న్యాయం చేయగలడని ఆ పాత్రకు అతడిని ఎంపిక చేశారు. కృష్ణ కుమార్‌ పాత్రకు కమల్‌ సరిపోతాడని, ఈ ఇద్దరితో మల్టీస్టారర్‌గా తెరకెక్కిద్దామనుకున్నారు దర్శకనిర్మాతలు. అప్పటికే కమల్‌ మరో రెండు చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్టులో నటించేందుకు సాధ్యం కాలేదు. దాంతో బాలకృష్ణే రెండు పాత్రలు పోషించాడు. కమల్‌ నటించి ఉంటే ఈ అద్భుత చిత్రం ఇంకెలా ఉండేదో!

ఇది చదవండి: 'జాన్' బాలీవుడ్​కు వెళ్లడా.. కారణం ఇదేనా..?

ABOUT THE AUTHOR

...view details