తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అందుకే వ్యవసాయం చేస్తున్నా: సమంత - సమంత సేంద్రీయ వ్యవసాయం

లాక్​డౌన్ కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు సినీ తారలు. వారికి నచ్చిన వ్యాపకాలతో బిజీగా గడుపుతున్నారు. అక్కినేని కోడలు సమంత మిద్దె వ్యవసాయంపై దృష్టిపెట్టారు. తాజాగా వ్యవసాయం చేయడానికి గల కారణాల్ని వివరించారు.

అందుకే వ్యవసాయం చేస్తున్నా : సమంత
అందుకే వ్యవసాయం చేస్తున్నా : సమంత

By

Published : Jul 31, 2020, 11:44 AM IST

షూటింగ్‌లు లేకపోవడం వల్ల లాక్‌డౌన్‌ కాలాన్ని అగ్ర కథానాయిక సమంత చాలా బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకుంటున్నారు. అంతేకాదు, ఇటీవలే మిద్దెపై వ్యవసాయాన్ని కూడా ప్రారంభించారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఓ వీడియోను షేర్‌ చేస్తూ, "మీ ఆహారాన్ని మీరే పండించుకోవడం అంటే, మీరే సొంతంగా డబ్బును ముద్రించుకోవడం లాంటిది" అని రాన్‌ఫిన్లే వ్యాఖ్యను జత చేశారు.

‘‘"ప్రతి ఒక్కరూ ఉత్తమమైన వాటిని చేయడానికి ఇష్టపడతారు. సృజనాత్మకతకు బయట కొదవలేదు. డ్యాన్స్‌, ఆర్ట్, వంట చేయడం, కవిత్వం రాయడం ఇలా ఎన్నో ఉన్నాయి. అవన్నీ నేను చేయలేనని నాకు తెలుసు. అయితే, ప్రతి ఒక్కరూ చేసే దానికి కాస్త భిన్నంగా చేయాలని అనుకుంటా. అదే సమయంలో అది చాలా సులభం. అదేమీ ఆశ్చర్యపోయే విషయం కాదు. తోటపనికి సంబంధించి ఇప్పటికే ఎన్నో పోస్ట్‌లు చేశా. అయితే, ఎందుకు ఈ ప్రయాణం ప్రారంభించానో చెప్పాలనుకుంటున్నా."’

"లాక్‌డౌన్‌ ప్రకటించగానే అందరిలాగే నేనూ ఆశ్చర్యపోయా. సరకుల కోసం నేను, చైతన్య సూపర్‌మార్కెట్‌కు పరిగెత్తాం. మీలో చాలా మంది ఇదే చేసి ఉంటారు. తెచ్చుకున్న సరకులన్నీ ఎన్ని రోజులు వస్తాయో లెక్కపెట్టాం. అవన్నీ అయిపోతే చేయాలో తెలియని పరిస్థితి. ఆ సమయంలో అందరం భయపడ్డాం. పైగా మీకు, మీ ఆప్తులకు ఆరోగ్యకరమైన ఆహారం కష్టమే. ఆ పరిస్థితితో నేను గందరగోళానికి గురయ్యా. మనకు పోషకాలతో కూడిన ఆహారం లేదు. ఈ విపత్కర పరిస్థితి నాకు ఒక పాఠాన్ని నేర్పింది. అందుకే అవసరమైన ఆహారాన్ని పండించుకోవాలని నిర్ణయించుకున్నా. ఈ విషయాన్ని మీతో కూడా పంచుకున్నా"’ అని చెప్పుకొచ్చింది సమంత.

ABOUT THE AUTHOR

...view details