తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నేను అలానే ఉంటా.. చిన్నప్పటి నుంచి అంతే' - That's all since I was a child says tapsee

తాను చిన్నప్పట్నుంచి ఎదురుతిరిగే స్వభావం కలిగిన అమ్మాయినని చెప్పుకొచ్చింది హీరోయిన్ తాప్సీ. 'తప్పాడ్' చిత్రంలో చాలా సున్నితమైన పాత్ర పోషించానని తెలిపింది.

తాప్సీ
తాప్సీ

By

Published : Apr 26, 2020, 6:48 AM IST

'ఝుమ్మంది నాదం', 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌', 'మొగుడు', 'దరువు'లాంటి సినిమాల్లో నటించిన నాయిక తాప్సీ. తాను చిన్నప్పట్నుంచి ఎదురుతిరిగే స్వభావం కలిగిన అమ్మాయినని చెబుతోందీ హీరోయిన్. 'తప్పాడ్‌' చిత్రం గురించి తాప్సీ మాట్లాడుతూ ఈ విధంగా స్పందించింది.

"నాకు చిన్నతనం నుంచే కొంచెం తిరుగుబాటు స్వభావం ఎక్కువ. అది కచ్చితంగా నా సినిమాల్లో మీకు కనిపిస్తుంది. గత ఆరు నెలల కాలం నాకెంతో ఆశ్చర్యం కలిగిస్తోంది. స్టాండప్‌ కామెడీ నుంచి 'తప్పాడ్‌' చిత్రంలో చాలా సున్నితమైన పాత్ర పోషించాను. ఇంకా నేను మరిన్ని పాత్రలను చేయగలననే నమ్మకం ఉంది."

-తాప్సీ, హీరోయిన్

అనుభవ్‌ సిన్హా దర్శకత్వంలో (తప్పాడ్‌) పనిచేయడం చాలా గర్వంగా ఉందని తెలిపింది తాప్సీ. అతడు సున్నితమైన అంశాలను చాలా జాగ్రత్తగా తెరకెక్కించగలడని ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ 'హసీన్‌ దిల్‌రుబా', 'లూప్‌ లాపెట', 'షబాస్‌ మిథు' అనే చిత్రాల్లో నటిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details