జోష్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన అక్కనేని నాగచైతన్య. ఈ చిత్రంలో విద్యార్థిగా కనిపించి తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఈ చిత్రానికి వాసు వర్మ దర్శకుడు. ముందుగా చైతూని వెండితెరకు పరిచయం చేసే బాధ్యత ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తీసుకోవాలనుకున్నాడట. తాను రాసుకున్న కథను వినిపించగా.. తొలి చిత్రమే అలాంటి కథలో నటిస్తే ప్రేక్షకుల్లోకి వెళ్లగలుగుతాడో, లేదో? అనే సందేహంతో నాగార్జున వద్దన్నాడు.
అందుకే చైతూ తొలి చిత్రం పూరితో చేయలేదట!
జోష్ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన నాగచైతన్య.. మొదటి సినిమాను పూరి జగన్నాథ్‌తో కలిసి తీయాల్సిందట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేకపోయింది. ఇంతకీ ఏం జరిగింది?
అందుకే చైతూ తొలి చిత్రం పూరితో చేయలేదట!
పూరి అంటే మాస్ సినిమాలే గుర్తొస్తాయి. వారసుడిని తొలి చిత్రంలోనే మాస్ కథానాయకుడిగా కనిపిస్తే బాగుండదనే ఉద్దేశంతో పూరితో చేయలేకపోయాడు నాగచైతన్య. ఆ తర్వాత వాసువర్మ చెప్పిన కథ నచ్చి ఓకే చేశాడు. అక్కినేని అభిమానుల్లో 'జోష్' నింపాడు. మరో విశేషం ఏంటంటే? చైతూ నటించిన రెండో చిత్రం 'ఏమాయ చేశావే'లో దర్శకుడుగా కనిపిస్తాడు పూరి.
ఇవీ చూడండి.. 'క్షీరసాగర మథనం' విలన్‌ను పరిచయం చేసిన అడవి శేషు